మూడో టీ20లో మూడు: కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు

By Siva KodatiFirst Published Jan 28, 2020, 4:46 PM IST
Highlights

రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ పర్యటనలో మరికొన్ని రికార్డులపై కన్నేశాడు. 

రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ పర్యటనలో మరికొన్ని రికార్డులపై కన్నేశాడు. తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

Also Read:ధోనీ కోసం ఖాళీగా ఉంచాం: ఉద్వేగానికి గురైన చాహల్

అయితే బుధవారం జరగనున్న మూడో టీ20లో కోహ్లీ 25 పరుగులు చేస్తే గనుక మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్ధలు కొడతాడు. భారత్ తరపున అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌గా ధోనీ చేసిన పరుగులు 1,112.. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లీ కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు.

కెప్టెన్లుగా ఉండి టీ20లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో డుప్లెసిస్ (1,273), కేన్ విలియమ్సన్ (1,148) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే అంతర్జాతీయ టీ20లో 50 కన్నా అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో డుప్లెసిస్‌తో కలిసి కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.

Also Read:ఐపీఎల్ 2020.. రూమర్స్ కి చెక్, గంగూలీ కీలక ప్రకటన

మరో హాఫ్ సెంచరీ సాధిస్తే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరసన చేరతాడు. ఇక మరో రికార్డు విషయానికి వస్తే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల లిస్ట్‌లో చేరడానికి కోహ్లీకి ఏడు సిక్సర్లు అవసరం. ఈ ఫీట్‌ను ఇప్పటి వరకు ఇంగ్లీష్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రమే సాధించాడు. కోహ్లీ మరో ఏడు సిక్సర్లు సాధిస్తే కెప్టెన్‌గా 50 సిక్సర్లు కొట్టిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు.

click me!