India vs England: భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభం అయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే సిరీస్ ను 3-1 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.
India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో చివరి మ్యాచ్ గురువారం నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే 3-1 అధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. 112 ఏళ్ల తర్వాత భారత జట్టు టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. దీని కోసం కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగింది.
టెస్టు క్రికెట్ సిరీస్ లలో తొలి మ్యాచ్ ఓడిపోయి సిరీస్ ను కైవసం చేసుకున్న ఘటనలు చాలా అరుదు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇలా కేవలం 3 సార్లు మాత్రమే జరిగింది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధమైంది. 1897-98లో మొదటి సారి ఇలా జరిగింది. ఆ తర్వాత యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఈ రికార్డును సృష్టలించగా, ఆ తర్వాత మళ్లీ అదే జట్టు ఈ రికార్డును పునరావృతం చేసింది. మళ్లీ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ మూడోసారి ఈ ఘనత సాధించింది.
IND VS ENG: ఇద్దరు స్టార్లు.. అశ్విన్ సరికొత్త రికార్డు !
1911లో సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయింది, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 4-1తో గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు 112 ఏళ్ల తర్వాత భారత్‌కు అలాంటి అద్భుతమైన రికార్డు సృష్టించే అవకాశం లభించింది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. దీంతో 112 ఏళ్ల తర్వాత మళ్లీ సరికొత్త చరిత్ర పునరావృతం కానుంది.
లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ బరువు తగ్గడానికి ఏ చేస్తదో తెలుసా?
గత 112 ఏళ్లలో తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్‌లో మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ విజయం సాధించిన తొలి జట్టుగా టీమిండియా అవతరించే అవకాశం ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత భారత్ తన అధిపత్యం ప్రదర్శిస్తూ బలమైన పునరాగమనం చేసి విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 106 పరుగులతో, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో 434 పరుగులతో, ఆ తర్వాత రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సొంతగడ్డపై భారత్ వరుసగా 17వ టెస్టు సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. ఈ విజయ పరంపర 22 ఫిబ్రవరి 2013 నుండి ఇప్పటి వరకు కొనసాగుతోంది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన తర్వాత పునరాగమనం చేసిన భారత్ ఏడోసారి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. బాజ్ బాల్ గేమ్ తో కెప్టెన్ గా బెన్ స్టోక్స్, కోచ్ గా బ్రెండన్ మెకల్లమ్ రాక తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కావడం గమనార్హం.
జబర్దస్త్ డైరెక్టర్ నాతో అలా అన్నాడు... ఎట్టకేలకు అసలు మేటర్ బయటపెట్టిన యాంకర్ సౌమ్యరావు