
ఇంగ్లాండ్ ను వారి స్వదేశంలో టీ20లలో ఓడించిన ఉత్సాహం మీద ఉన్న భారత జట్టు నేటి నుంచి మరో వైట్ బాల్ పోరుకు సిద్ధమైంది. ఆ జట్టుతో మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ కు దిగనుంది. టీ20లలో ఇండియా చేతిలో ఓడినందుకు పగ తీర్చుకోవాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్ ఉంది. సీనియర్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జో రూట్, జానీ బెయిర్ స్టో లు తుది జట్టుతో కలిశారు. అదేసమయంలో ఇంగ్లాండ్ కు వన్డేలలోకూడా టీ20 లలో మాదిరిగానే ట్రీట్మెంట్ ఇవ్వాలని టీమిండియా భావిస్తున్నది.
జేసన్ రాయ్, బట్లర్, జో రూట్, లియామ్ లివింగ్ స్టోన్, బెన్ స్టోక్స్, జానీబెయిర్ స్టో వంటి ఆటగాళ్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. వీరిని పెవిలియన్ చేర్చడానికి టీమిండియా బౌలర్లు శ్రమించాల్సిందే. ఏమాత్రం అవకాశం చిక్కినా ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడం పెద్ద విషయమేమీ కాదు.
ఇక టీమిండియా కూడా ఏం తక్కువ తిన్లేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా లతో మన బ్యాటింగ్ లైనప్ కూడా లోతుగానే ఉంది. బౌలింగ్ లో బుమ్రాకు తోడుగా సీనియర్ పేసర్ షమీ, ప్రసిధ్ కృష్ణ జతకలిశాడు. గజ్జల్లో గాయం కారణంగా కోహ్లీ ఈమ్యాచ్ లోబరిలోకి దిగడంలేదు. అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తుది జట్లు :
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్), జో రూట్, లియామ్ లివింగ్ స్టోన్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మోయిన్అలీ, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స, క్రెయిగ్ ఓవర్టన్, రీస్ టాప్లే