
శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత మహిళా జట్టు, త్వరలో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోతోంది. 1998లో కౌల్హంపూర్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే టోర్నీమెంట్ జరిగింది. వివిధ కారణాల వల్ల ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నీలు జరగలేదు...
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 8 మహిళా జట్టు పాల్గొనబోతున్నాయి. గ్రూప్ ఏలో భారత జట్టుతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉన్నాయి...
జూలై 29న ఆస్ట్రేలియాతో ఎడ్జ్‌బాస్టన్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొదటి మ్యాచ్ ఆడే భారత మహిళా జట్టు, ఆ తర్వాత జూలై 31న దాయాది పాకిస్తాన్‌తో తలబడుతుంది. ఆగస్టు 3న బార్బడోస్ టీమ్‌తో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా...
కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీకి 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వికెట్ కీపర్ తానియా భాటియా, హర్లీన్ డియోల్‌లకు కామన్వెల్త్ గేమ్స్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కింది...
వికెట్ కీపర్ తానియా భాటియా 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకి దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాకి కూడా పిలుపునిచ్చారు సెలక్టర్లు... అలాగే యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌లకు కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా భాటియా, యషికా భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా...
అలాగే రిచా ఘోష్, సిమ్రాన్ బహదూర్, పూనమ్ యాదవ్‌లకు స్టాండ్ బై ప్లేయర్లుగా భారత జట్టులో చోటు దక్కింది.