
ఆసిస్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్లు ఆస్ట్రేలియా బయల్దేరారు. బుధవారం ఉదయం ఆస్ట్రేలియా పయనమయ్యారు. ఇదిలా ఉంటే సిరీస్ ప్రారంభం కావడానికి సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ టీమిండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆసియా కప్ 2025 లో పాకిస్తాన్ ఆటగాళ్లకు టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఒక రకంగా ట్రోలింగ్ చేశారు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పై విమర్శలు చేశారు. కయో స్పోర్ట్స్ ఛానల్‌లో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో సిల్లీ కామెంట్స్ చేశారు. మహిళా క్రికెటర్లు కూడా ఈ ర్యాగింగ్‌లో పాల్గొని, ఇండియన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ అవసరం లేదని హైలైట్ చేశారు. చేతులతో సైగలు చేస్తూ నానా హంగామా చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. పహల్గామ్ దాడిలో అమాయక పర్యాటకులు చనిపోతే పాకిస్థాన్ కానీ ఆ దేశ క్రికెట్ కానీ ఖండించలేదని, అలాంటి వారికి షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. భారతీయుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కయో స్పోర్ట్స్ సైతం ఆ వీడియోను డిలీట్ చేసింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు జరిగాయి. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తండ్రి అవుతోన్న కారణంగా మొదటి వన్డేకు రాలేకపోతున్నాడు. ఆయన స్థానంలో ఎడమచేతి స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ ఆడతాడు. ఇక హామ్ స్ట్రింగ్ గాయంతో మొదటి రెండు వన్డేల్లో ఆడలేడు. స్థానంలో జోష్ ఫిలిప్ వికెట్ కీపర్‌గా రానున్నాడు.