INDvsAUS T20I: గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో రుతురాజ్ కొత్త చరిత్ర సృష్టించాడు. తన మెరుపు శతకంతో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఇంతకీ రికార్డులు ఏంటీ?
INDvsAUS T20I: గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత జట్టుపై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. టీం ఇండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్‌తో సంచలనం సృష్టించాడు. కేవలం 57 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ తరుణంలో రుతురాజ్ గైక్వాడ్ తొలి సెంచరీ సాధించి.. ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సెంచరీ తో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులను గైక్వాడ్ బద్దలు కొట్టాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?
రుతురాజ్ గైక్వాడ్ T-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో T-20 లో ఆస్ట్రేలియాపై శతకం బాదిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రుతురాజ్ నిలిచాడు. అదే సమయంలో ఆసీస్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రుతురాజ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే సమయంలో గౌహతిలో సెంచరీ చేయడం ద్వారా రుతురాజ్ ఒక సందర్భంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ వేసిన చివరి ఓవర్‌లో మొత్తం 30 పరుగులు చేసి మెరుపు సెంచరీ సాధించాడు. టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. దీంతో కోహ్లి, రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ అయ్యాయి. న్యూజిలాండ్‌పై 126 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు
1. శుభమాన్ గిల్ (126* పరుగులు), ఇండియా vs న్యూజిలాండ్, అహ్మదాబాద్, 2023
2. రుతురాజ్ గైక్వాడ్ (123*పరుగులు), భారత్ vs ఆస్ట్రేలియా, గౌహతి, 2023
3. విరాట్ కోహ్లీ (122* పరుగులు), ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్, 2021
4. రోహిత్ శర్మ (118 పరుగులు), భారత్ vs శ్రీలంక, ఇండోర్, 2023
5. సూర్యకుమార్ యాదవ్ (117 పరుగులు), ఇండియా vs ఇంగ్లండ్, నాటింగ్‌హామ్, 2022