Azam Khan: ఎంతపని చేశావయ్యా అజామ్..

By Rajesh Karampoori  |  First Published Nov 29, 2023, 6:22 AM IST

Azam Khan: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజామ్ ఖాన్ వివాదంలో ఇరుక్కున్నాడు. జాతీయ T-20 ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఓ పొరపాటు చేయడం వల్ల అజం ఖాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ పోరపాటు ఏంటీ? ఎందుకు భారీ మొత్తంలో ఫైన్ కట్టాల్సి వచ్చింది. 


Azam Khan: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అజామ్ ఖాన్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది.  జాతీయ T-20 ఛాంపియన్‌షిప్ సందర్భంగా అజామ్ ఖాన్ తన బ్యాట్‌పై పాలస్తీనా జెండా ఉన్న బ్యాట్ ను  ఉపయోగించడం వల్ల వివాదంలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు సీరియస్ గా తీసుకుంది. పాలస్తీనా జెండా ఉన్న బ్యాట్ ను ఉపయోగించి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కుమారుడు అజామ్ రెండు రోజుల క్రితం తన బ్యాట్ నుండి పాలస్తీనా జెండా స్టిక్కర్‌ను తొలగించడానికి నిరాకరించినందుకు పిసిబి మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్ సూచనలను పాటించడంలో ఆజం పలుమార్లు విఫలమయ్యాడు. కరాచీ వైట్స్, లాహోర్ బ్లూస్ మధ్య జరిగిన జాతీయ T20 కప్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.  

Latest Videos

undefined

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల ప్రకారం.. ఏ క్రికెటర్ కూడా రాజకీయ, మతపరమైన లోగో లు ఉన్న బ్యాట్ ఉపయోగించడం నిషేధం. ప్రతి ఆటగాడు అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లలో కూడా ఐసీసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇదే టోర్నమెంట్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో అజామ్ ఖాన్ బ్యాట్‌పై లోగో ఉంది. కానీ ఎవరూ ఈ 25 ఏళ్ళ బ్యాటర్ ను హెచ్చరించలేదు. రాబోయే మ్యాచ్‌లలో అజామ్ తన బ్యాట్ నుండి స్టిక్కర్‌ను తొలగించడానికి అంగీకరించాడా లేదా అనే దానిపై కూడా బోర్డు ఎటువంటి సమాచారం అందించలేదు. మ్యాచ్ అధికారులు ఆజం ఖాన్‌పై విధించిన జరిమానాలో 50 శాతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమీక్షించి, మాఫీ చేసిందని పిసిబి ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి ఘటననే ఒకటి చోటుచేసకుంది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదాన్ని క్రికెట్‌లోకి తీసుకవచ్చి పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ వివాదంలో ఇరుక్కున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిజ్వాన్.. తన జట్టు విజయాన్ని గాజా(పాలస్తీనా) పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. క్రికెట్‌పై దృష్టి పెట్టాలని, ప్రపంచ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని రిజ్వాన్ కు క్రికెట్ పెద్దలు సూచించారు.  
 

click me!