ఇదేం రాకెట్ సైన్స్ కాదు! అతని కోసం అలా సెలబ్రేట్ చేశా... - మహ్మద్ షమీ

By Chinthakindhi Ramu  |  First Published Nov 3, 2023, 2:11 PM IST

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... టీమిండియా తరుపున వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త చరిత్ర


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి 4 మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు మహ్మద్ షమీ. హార్ధిక్ పాండ్యా గాయపడడంతో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కింది. 3 మ్యాచుల్లో 14 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, రెండు మ్యాచుల్లో ఐదేసి వికెట్లు, ఓ మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు..

జెట్ స్పీడ్‌తో బెస్ట్ యావరేజ్‌తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ 6లోకి వచ్చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టీమిండియా తరుపున వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు..

Latest Videos

undefined

18 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ కారణంగా శ్రీలంక జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 302 పరుగుల తేడాతో ఘన విజయం దక్కింది. 

‘ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. నేను కేవలం నా రిథమ్‌ని ఫాలో అవుతున్నా. మా బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణిస్తోంది. మన కంటే ముందు ఇద్దరు బౌలర్లు వికెట్లు తీస్తే, ఆ రిథమ్ మనకు బాగా ఉపయోగపడుతుంది..

నా బౌలింగ్‌ని నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. నా టీమ్‌తో కలిసి బౌలింగ్ చేయడం ఇంకా ఎంజాయ్ చేస్తున్నా. దాని రిజల్ట్ మీరే చూస్తున్నారు. 

నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తా. లైన్ అండ్ లెంగ్త్ ఫాలో అవుతూ బౌలింగ్ చేస్తా. ఇలాంటి ఐసీసీ టోర్నీల్లో రిథమ్ కోల్పోతే, దాన్ని తిరిగి దక్కించుకునేందుకు పెద్దగా టైమ్ కూడా ఉండదు..

5 వికెట్ హాల్ తర్వాత నా సెలబ్రేషన్స్, మా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే‌కి సంబంధించింది. అతనికి తల మీద జట్టు ఉండదు. అందుకే అలా చేశాను...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ షమీ..

వరుసగా 7 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. నవంబర్ 5న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడే భారత జట్టు,నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో బెంగళూరుతో తలబడుతుంది. 

click me!