భారత ఫేస్ బౌలర్లు తమ సత్తాఏమిటో ప్రపంచ కప్ 2023 లో నిరూపిస్తున్నారు. బుమ్రా, షమీ, సిరాజ్ బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు.
ముంబై : అద్భుతమైన బ్యాటింగ్... అంతకంటే అదిరిపోయే బౌలింగ్... కళ్లుచెదిరే ఫీల్డింగ్... ఇంకేముంది ఫ్యాన్స్ కు టీమిండియా విశ్వరూపం దర్శనమిచ్చింది. ప్రపంచ కప్ 2023 మెగాటోర్నీలో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియన్ టీం నిన్న శ్రీలంకతో తలపడింది. ముంబై వాంఖడే స్టేడియంలో మొదట టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తే... ఆ తర్వాత బౌలర్లు వికెట్ల వర్షం కురిపించారు. దీంతో ప్రపంచ కప్ చరిత్రలోనే అరుదైన 302 పరుగుల భారీ తేడాతో భారత జట్టు అధ్బుత విజయాన్ని అందుకుంది.
నిన్నటి టీమిండియా ఆటతీరుకు ఫిదా కాని ఫ్యాన్ వుండబోడనడం అతిశయోక్తి కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం రోహిత్ సేనను కొనియాడకుండా వుండలేకపోతున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం తనదైన స్టైల్లో టీమిండియా సూపర్ విక్టరీ గురించి స్పందించారు.
undefined
''ప్రపంచ క్రికెట్ లో వెస్టిండిస్ ఓ వెలుగువెలిగిన రోజుల్లో వాళ్ల ఫేస్ అటాక్ ఎలావుండేదో తెలుసు. ప్రపంచ క్రికెట్ ను విండిస్ పేస్ బౌలర్ల భయపెట్టిన రోజులను నిన్నటి మ్యాచ్ లో టిమిండియా బౌలర్లు తిరిగి గుర్తుచేసారు. పేస్ అటాక్ తో వికెట్ల వర్షం కురిపిస్తూ ఒకే జట్టును రెండుసార్లు చిత్తుచేయడం నేనెప్పుడూ చూడలేదు. కానీ భారత బౌలర్లు లంక బ్యాటర్లకు టెర్రర్ పుట్టించారు. భారత ఫేసర్లను ఎదుర్కోలకపోయిన శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ ముగిసాకే కాస్త రిలీఫ్ అయివుంటారు'' అంటూ టీమిండియా ఫేస్ బౌలర్లను ఆనంద్ మహింద్రా ఆకాశానికి ఎత్తారు.
Not even in the glory days of the West Indies, when their pace attack was the most feared in the world, do I recall them ever unleashing this rain of wickets twice on the same team. A reign of terror… When the match ended, I just felt relief that the suffering had ended for SL. https://t.co/qYkPjlibfg
— anand mahindra (@anandmahindra)
ఇదిలావుంటే నిన్న భారత్-శ్రీలంక మ్యాచ్ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసియా కప్ లో శ్రీలంకను వారి స్వదేశంలోనే 51 పరుగులకు ఆలౌట్ చేసారు భారత బౌలర్లు. ఏదో ఒకసారి ఇలా జరుగుతుందని అందరూ భావించారు. కానీ సేమ్ సీన్ నిన్నటి మ్యాచ్ లో రిపీట్ అయ్యింది. మొదట భారత బ్యాటర్ల మెరుపులు... ఆ తర్వాత బౌలర్ల దాటిని శ్రీలంక తట్టుకోలేకపోయింది.
Read More మహ్మద్ షమీ రికార్డు ఫీట్! సిరాజ్ సెన్సేషన్... లంకను చిత్తు చేసి సెమీస్ చేరిన టీమిండియా..
మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రోహిత్ ఆరంభంలోనే ఔటవడంతో షాక్ తగిలింది. కానీ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, యువ సంచలనం శుభ్ మన్ గిల్ థ్రిల్లింగ్ ఇన్నింగ్స్ తో పరుగుల వరద పారించారు. చివరో లోకల్ బాయ్ శ్రేయాస్ అయ్యర్ మెరుపులు మెరిపించాడు. దీంతో శ్రీలంక ముందు 358 పరుగుల భారీ లక్ష్యం చేధించాల్సి వచ్చింది.
భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లను భారత పేసర్లు భయకంపితులను చేసారు. బుమ్రా మొదటి వికెట్ తీసి శ్రీలంక పతనాన్ని ప్రారంభిస్తే ఆ తర్వాత షమీ, సిరాజ్ మిగతా పని కానిచ్చేసారు. షమీ అయితే బుల్లెట్ లాంటి బంతులతో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించాడు. ఈ ప్రపంచకప్ రెండోసారి ఐదు వికెట్ల ఫీట్ ను సాధించాడు. చివరకు శ్రీలంక కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.