ICC World cup 2023: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... సూర్యకుమార్ యాదవ్, షమీలకు ఛాన్స్...

India vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్.. 

ICC World cup 2023: Team India won the toss and elected to field, Shami and Suryakumar yadav gets CRA

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు ఇండియా- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.  

న్యూజిలాండ్- ఇండియా రెండు జట్లు కూడా మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు, టేబుల్ టాపర్‌గా నిలిచి దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. 

Latest Videos

2003 వన్డే వరల్డ్ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలవలేదు భారత జట్టు. 2019 వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2021 టీ20 వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 మ్యాచుల్లో భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. 

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడడంతో అతని స్థానంలో మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కింది. శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

 న్యూజిలాండ్ జట్టు: డివాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డార్ల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

vuukle one pixel image
click me!