ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 లో మంచి దూకుడుమీదును జట్లమధ్య నేడు కీలక సమరం జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య టీమిండియా పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన కివీస్ తో తలపడనుంది.
ధర్మశాల : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 లో టీమిండియా మంచి దూకుడుమీదుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొహ్లీ సేనను గాయాలు వెంటాడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడుతున్న న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. నేడు ధర్మశాలలో మ్యాచ్ లో బలమైన జట్టుతో బరిలోకి దిగాలనుకుంటున్న టీమిండియాకు ఈ గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే మంచి ఫామ్ లో వున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆడించాలని భావిస్తున్న యువ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా గాయపడటం టీమిండియాకు ఎదురుదెబ్బే అని చెప్పాలి.
ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. దీంతో ఇవాళ న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో అతడు ఆడటంలేదని ఇప్పటికే బిసిసిఐ ప్రకటించింది. ఇప్పటికే హార్దిక్ మినహా ఇతర ఆటగాళ్లంతా కివీస్ తో మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకున్నారు. గాయపడిన హార్దిక్ మాత్రం పూణే నుంచి బెంగళూరులోకి జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడు.
undefined
హార్దిక్ జట్టుకు దూరం కావడంతో ఇప్పటివరకు రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన యువ టాలెంటెడ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగానే అతడు ధర్మశాలలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అయితే ఈ ప్రాక్టీసే అతడి కొంప ముంచింది. తుదిజట్టులో చోటు దక్కుతుందని అనుకుంటున్న అతడు ప్రాక్టీస్ సెషన్ లో తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ కు బౌలర్ విసిరిన బంతి బలంగా తాకినట్లు తెలుస్తోంది. మణికట్టుకు బంతి తగలడంతో విలవిల్లాడిపోయిన సూర్యకుమార్ ప్రాక్టీస్ సెషన్ నుండి అర్దాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఇలా ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డ సూర్యకుమార్ టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య జరిగే మ్యాచ్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.
ఇదిలావుంటే మరో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా ప్రాక్టిస్ సెషన్ లో తేనేటీగ దాడికి గురయ్యాడు. తీవ్ర నొప్పితో అతడు కూడా ప్రాక్టీస్ కు దూరమయ్యాడు. అయితే ఇషాన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని టీమిండియా సహాయక సిబ్బంది చెబుతున్నారు.
ఇక బంగ్లాదేశ్ తో జరిగన మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ నాటికి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అక్టోబర్ 29న లక్నో వేదికన టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు వారంరోజుల సమయం వుండటంతో అప్పటివరకు హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకునే అవకాశాలున్నాయి.