‘అష్ట’ దిగ్బంధం! రోహిత్ సేన తిరుగులేని జైత్రయాత్ర... సౌతాఫ్రికాని చిత్తు చేసిన టీమిండియా!

By Chinthakindhi Ramu  |  First Published Nov 5, 2023, 9:03 PM IST

India vs South Africa: 327 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 83 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... 243 పరుగుల తేడాతో టీమిండియాకి ఘన విజయం.. వన్డే వరల్డ్ కప్‌లో 8వ విజయం..


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుసగా 8వ విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది టీమిండియా. 327 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికా, 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  

5 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. 11 పరుగులు చేసిన తెంబ భవుమాని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 9 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ని మహ్మద్ షమీ అవుట్ చేయగా హెన్రీచ్ క్లాసిన్ 11 బంతుల్లో 1 పరుగు చేసి జడ్డూ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

Latest Videos

13 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. 

11 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 7 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్ కూడా జడ్డూ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మార్కో జాన్సెన్ 30 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసి సఫారీ టీమ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కగిసో రబాడా 6 పరుగులు చేయగా లుంగి ఇంగిడి డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీయగా మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్‌కి ఓ వికెట్ దక్కింది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగుల భారీ స్కోరు చేసింది.. రోహిత్ శర్మ 40, శుబ్‌మన్ గిల్ 23, శ్రేయాస్ అయ్యర్ 77, కెఎల్ రాహుల్ 8, సూర్యకుమార్ యాదవ్ 22, రవీంద్ర జడేజా 29 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ సెంచరీ అందుకున్నాడు. వన్డేల్లో 49వ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 

click me!