India vs South Africa: 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా... రెండేసి వికెట్లు తీసిన మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా..
కోల్‌కత్తాలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ చేశాడు. విరాట్ చేసిన స్లోయెస్ట్ సెంచరీల్లో ఒకటి. అయితే ఆరంభంలో రోహిత్ వేగంగా పరుగులు చేయడంతో విరాట్‌ని ‘సెల్ఫిష్’ అంటూ ట్రోల్ చేశారు రోహిత్, ధోనీ ఫ్యాన్స్. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ గురించి వాళ్లకు పూర్తి క్లారిటీ వచ్చింది..
సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరడంతో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. 5 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు.
11 పరుగులు చేసిన తెంబ భవుమాని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 9 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ని మహ్మద్ షమీ అవుట్ చేయగా హెన్రీచ్ క్లాసిన్ 11 బంతుల్లో 1 పరుగు చేసి జడ్డూ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
13 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగుల భారీ స్కోరు చేసింది.. రోహిత్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి మెరుపు ఆరంభం అందించాడు. దీంతో మొదటి 5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది భారత జట్టు. వన్డేల్లో టీమిండియాకి మొదటి 5 ఓవర్లలో ఇదే అత్యధిక స్కోరు..
రోహిత్ మరోసారి హాఫ్ సెంచరీ ముందు అవుట్ కాగా 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
సచిన్ టెండూల్కర్ తర్వాత సౌతాఫ్రికాపై 3 వేలకు పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, స్వదేశంలో 6 వేల వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
అలాగే వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 1500+ పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగర్కర మాత్రమే 1500+ వన్డే వరల్డ్ కప్ పరుగులు చేశారు..
కెఎల్ రాహుల్ 17 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన విరాట్ కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు..
వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 452 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా విరాట్‌కి ఇది 79వ అంతర్జాతీయ సెంచరీ.