ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే శుబ్‌మన్ గిల్ డిశార్జ్... ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీకి టీమిండియా ప్లేయర్లు, చెన్నైలోనే ఉండిపోయిన టీమిండియా ఓపెనర్..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. డెంగ్యూతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్, ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయ్యాడు. మంగళవారం, శుబ్‌మన్ గిల్ ప్లేటెంట్స్ సంఖ్య స్వల్పంగా తగ్గడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే.
అయితే ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే శుబ్‌మన్ గిల్ ప్లేటెంట్స్ సంఖ్య పెరగడంతో అతన్ని డిశార్జ్ చేశారు. అయితే డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే శుబ్‌మన్ గిల్, టీమ్‌కి అందుబాటులోకి వస్తాడు. మరో రెండు మూడు రోజుల పాటు చెన్నైలో బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉండే శుబ్‌మన్ గిల్.. పూర్తిగా కోలుకున్న తర్వాత టీమ్‌తో కలుస్తాడు.
undefined
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడింది భారత జట్టు. తర్వాతి మ్యాచ్ కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది టీమిండియా. అయితే డెంగ్యూతో బాధపడుతున్న శుబ్‌మన్ గిల్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయాడు..
అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కి కూడా శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సమయానికి శుబ్‌మన్ గిల్, టీమ్‌తో కలిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో మిస్ అయినా ఆ తర్వాత డిసెంబర్ 19న పూణేలో ఇండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ సమయానికి శుబ్‌మన్ గిల్, టీమ్‌కి అందుబాటులోకి రావచ్చు..