నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. ప్రపంచ కప్‌లో రెండో విజయం..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో గెలిచింది న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 322 పరుగుల భారీ స్కోరు చేసింది..
డివాన్ కాన్వే 32 పరుగులు చేయగా విల్ యంగ్ 80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 51 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. డార్ల్ మిచెల్ 48, టామ్ లాథమ్ 53 పరుగులు చేయగా మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 4, చాప్‌మన్ 5, మ్యాట్ హెన్రీ 10 పరుగులు చేశారు...
ఈ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. విక్రమ్‌జీత్ సింగ్ 12, మ్యాక్స్ ఓడౌడ్ 16, కోలీన్ అకీర్‌మన్ 73 బంతుల్లో 5 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. బస్ దే లీడ్ 18, తేజ నిడమనురు 21, స్కాట్ ఎడ్వర్డ్స్ 30, సోబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ 29, రియాన్ క్లెన్ 8, ఆర్యన్ దత్ 11 పరుగులు చేశారు..
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 5 వికెట్లు తీయగా మ్యాట్ హెన్రీ 3 వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర ఓ వికెట్ తీశాడు. 21 పరుగులు చేసిన తేజ నిడమనురు రనౌట్ అయ్యాడు.