వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ వరుస వైఫల్యాలు... చీఫ్ సెలక్టర్ పొజిషన్‌ నుంచి తప్పుకున్న ఇంజమామ్ ఉల్ హక్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 30, 2023, 8:50 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచుల్ల ో ఓడిన పాకిస్తాన్... సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న పాక్.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ వరుసగా నాలుగు పరాజయాలను ఎదుర్కొంది. మొదటి రెండు మ్యాచుల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై ప్రతాపం చూపించిన పాక్, ఆ తర్వాత టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది..

టీమిండియాతో మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో 62 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్, పసి కూన ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. సౌతాఫ్రికాతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓడిన పాకిస్తాన్, సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది..

Latest Videos

undefined

మిగిలిన మూడు మ్యాచుల్లో పాకిస్తాన్ గెలిచినా, సెమీస్ చేరే అవకాశాలు చాలా తక్కువే. పాకిస్తాన్ టాపార్డర్ బ్యాటర్లతో పాటు వరల్డ్ క్లాస్ బౌలర్లుగా గుర్తింపు తెచ్చుకున్న షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ అండ్ కో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. పాకిస్తాన్ వరుస వైఫల్యాలతో పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్, తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..

‘సొంత ప్రయోజనాల కోసం టీమ్ సెలక్షన్ విషయంలో పక్షపాతం చూపించానని నాపై వస్తున్న ఆరోపణలపై పీసీబీ విచారణ జరిపించవచ్చు. నేను పీసీబీ చీఫ్ సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నా పైన వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపితమైతే నేను తిరిగి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా..’ అంటూ వ్యాఖ్యానించాడు ఇంజమామ్ ఉల్ హక్..
 

click me!