ఆసియా కప్ 2023 టోర్నీలో గాయపడిన అక్షర్ పటేల్... గాయంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి అవుట్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి తొలుత ప్రకటించిన జట్టులో అక్షర్ పటేల్‌కి కూడా చోటు దక్కింది. అయితే ఆసియా కప్ 2023 టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్, పూర్తిగా కోలుకోలేదని అతన్ని తప్పించి, రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు కల్పించారు సెలక్టర్లు..
ఆ సమయంలో అక్షర్ పటేల్ చేసిన ఇన్‌స్టా పోస్ట్, పెను దుమారం రేపింది. ‘కామర్స్ బదులుగా సైన్స్ చదివి ఉంటే బాగుండేది. ఇంకా ఓ మంచి పీఆర్‌ని పెట్టుకుని ఉంటే బాగుండేది..’ అంటూ గుండె పగిలిన ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెట్టాడు అక్షర్ పటేల్. కొద్దిసేపటికే ఈ స్టోరీని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది..
గాయంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి దూరమైన అక్షర్ పటేల్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. గుజరాత్ ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో ఆడని అక్షర్ పటేల్, అక్టోబర్ 23న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసిన అక్షర్ పటేల్, 4 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చాడు. కేవలం రవిచంద్రన్ అశ్విన్‌ని వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకు రావడానికే అక్షర్ పటేల్‌ని గాయం వంకతో తప్పించారనే వార్తలకు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ మరింత ఊతం కలిగిస్తోంది..
అక్షర్ పటేల్ స్థానంలో వరల్డ్ కప్‌లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 34 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. అక్షర్ పటేల్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జట్టులో ఉన్నా అతనికి తుది జట్టులో చోటు దక్కడం చాలా కష్టమయ్యేది..