శ్రీలంకతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... మొదటి సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దాదాపు కన్ఫార్మ్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శ్రీలంక కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది న్యూజిలాండ్.. దీంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్. అయితే ఇంగ్లాండ్- పాకిస్తాన్ మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో అధికారికంగా న్యూజిలాండ్ సెమీస్ చేరుతుంది.
శ్రీలంక విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది న్యూజిలాండ్. డివాన్ కాన్వే 42 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 14, మార్క్ ఛాప్‌మెన్ 7 పరుగులు చేసి అవుట్ కాగా డార్ల్ మిచెల్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 46.4 ఓవర్లలో 171 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పథుమ్ నిశ్శంక 2, కుసాల్ మెండిస్ 6, సధీర సమరవిక్రమ 1, చరిత్ అసలంక 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఏంజెలో మాథ్యూస్ 16, ధనంజయ డి సిల్వ 19 పరుగులు చేయగా ఛమికా కరుణరత్నే 6 పరుగులు చేశాడు..
కుసాల్ పెరేరా 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేయగా మహీశ్ తీక్షణ 91 బంతులు ఆడి 3 ఫోర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దుస్మంత ఛమీరా 1, దిల్షాన్ మధుశంక 19 పరుగులు చేశారు..