ICC World cup 2023: 46.4 ఓవర్లలో 171 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక.. 51 పరుగులు చేసిన కుసాల్ పెరేరా..
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయారు. ఫలితంగా బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 46.4 ఓవర్లలో 171 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
పథుమ్ నిశ్శంక 2, కుసాల్ మెండిస్ 6, సధీర సమరవిక్రమ 1, చరిత్ అసలంక 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఏంజెలో మాథ్యూస్ 16, ధనంజయ డి సిల్వ 19 పరుగులు చేయగా ఛమికా కరుణరత్నే 6 పరుగులు చేశాడు..
కుసాల్ పెరేరా 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేయగా మహీశ్ తీక్షణ 91 బంతులు ఆడి 3 ఫోర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దుస్మంత ఛమీరా 1, దిల్షాన్ మధుశంక 19 పరుగులు చేశారు..
19వ ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. అయితే దుస్మంత ఛమీరాతో 9 ఓవర్లు, దిల్షాన్ మధుశంకతో కలిసి 14 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకుని.. శ్రీలంక ఇన్నింగ్స్‌ని 47వ ఓవర్ వరకూ చేర్చాడు మహీశ్ తీక్షణ..
పాక్‌తో మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చిన ట్రెంట్ బౌల్ట్, 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్ స్పెల్‌లో 3 మెయిడిన్లు కూడా ఉన్నాయి. లూకీ ఫర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర రెండేసి వికెట్లు తీయగా టిమ్ సౌథీకి ఓ వికెట్ దక్కింది..
ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఎంత త్వరగా ఛేదిస్తే, సెమీస్ చేరే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +0.398 కాగా, ఆ తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్తాన్ +0.036 నెట్ రన్ రేటుతో ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచినా, పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఫలితం తేలిన తర్వాత సెమీస్ చేరే జట్టు డిసైడ్ అవుతుంది..