నెదర్లాండ్స్‌పై దంచికొట్టిన టీమిండియా... శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ సెంచరీలతో...

By Chinthakindhi Ramu  |  First Published Nov 12, 2023, 6:00 PM IST

నెదర్లాండ్స్‌పై 410 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. సెంచరీలు చేసిన శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్.. హాఫ్ సెంచరీలు చేసుకున్న విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ.. 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా, పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపం చూపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగుల భారీ స్కోరు చేసింది.. టీమిండియాకి ఇది వరల్డ్ కప్‌లో రెండో అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2007 వన్డే వరల్డ్ కప్‌లో బర్మోడాపై 413 పరుగుల స్కోరు చేసింది భారత జట్టు.. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసుకోగా శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ సెంచరీల మోత మోగించారు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

Latest Videos

undefined

32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. వన్ దేర్ మెర్వీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

టూ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 62 బంతుల్లో సెంచరీ చేసిన కెఎల్ రాహుల్, వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు తరుపున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.

ఇదే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 బంతుల్లో సెంచరీ అందుకోగా ఆ రికార్డును కెఎల్ రాహుల్ అధిగమించాడు. సెంచరీ తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించి రాహుల్ అవుట్ అయ్యాడు.

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి నాలుగో వికెట్‌కి 208 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆఖరి బంతిని ఫేస్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు రాబట్టగలిగాడు.  సచిన్, అజయ్ జడేజా, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ తర్వాత నాలుగో స్థానంలో సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్.. 

click me!