రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్... వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా టాపార్డర్...

Published : Nov 12, 2023, 05:16 PM IST
రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్... వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా టాపార్డర్...

సారాంశం

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లకు ఫుల్లు ప్రాక్టీస్.. హాఫ్ సెంచరీలు అందుకున్న రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్... 

బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లో భారత జట్టు టాపార్డర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ అందరూ 50+ స్కోర్లు నమోదు చేశారు..

వరల్డ్ కప్ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు, టీమిండియాపై రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు. అయితే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఐదుగురు టాపార్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం మాత్రం ఇదే తొలిసారి..

రోహిత్ శర్మ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి అవుట్ కాగా శుబ్‌మన్ గిల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 42 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

77 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. బ్యాటర్లు సిక్సర్ల మోత మోగిస్తుండడంతో 44 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 330 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా.. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?