ICC World cup 2023: హార్ధిక్ పాండ్యాకి గాయం... ఆరేళ్ల తర్వాత బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ..

Published : Oct 19, 2023, 03:10 PM IST
ICC World cup 2023: హార్ధిక్ పాండ్యాకి గాయం... ఆరేళ్ల తర్వాత బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ..

సారాంశం

బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్ధిక్ పాండ్యా... ఆ ఓవర్‌ని ఫినిష్ చేసిన విరాట్ కోహ్లీ... భారీ స్కోరు దిశగా బంగ్లాదేశ్.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హార్ధిక్ పాండ్యా, మొదటి 3 బంతుల్లో 2 ఫోర్లు ఇచ్చాడు..

లిటన్ దాస్ కొట్టిన స్ట్రైయిక్ డ్రైవ్‌ని కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు హార్ధిక్ పాండ్యా. అయితే బంతి అందకపోగా, కాలు జారి ఎడమ కాలుపై బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. ఫిజియో చికిత్స తర్వాత బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించినా, సరిగ్గా నడిచేందుకు కూడా వీలు కాలేదు. దీంతో అతను పెవిలియన్‌కి చేరుకున్నాడు...

హార్ధిక్ పాండ్యా గాయపడడంతో అతని ఓవర్‌ని విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతులు వేసిన విరాట్ కోహ్లీ రెండు సింగిల్స్ ఇచ్చాడు. 2017లో చివరిగా వన్డేల్లో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఆరేళ్ల తర్వాత వన్డేల్లో బౌలింగ్‌ చేయడం విశేషం.. 10వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తన్జీజ్ హసన్, రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికే 63 పరుగులకే చేరుకుంది బంగ్లాదేశ్.

12 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది బంగ్లాదేశ్. 

PREV
click me!