టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... వరుసగా నాలుగో విజయంపై కన్నేసిన టీమిండియా...
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు టీమిండియా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది. పూణేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో బరిలో దిగిన టీమ్‌నే నేటి మ్యాచ్‌లోనూ కొనసాగించింది టీమిండియా...
ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహల్, శ్రేయాస్ అయ్యర్ తమ టచ్ చూపించారు. రోహిత్ శర్మ ఓ సెంచరీ, మరో మ్యాచ్‌లో 86 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. శుబ్‌మన్ గిల్ రీఎంట్రీ తర్వాత ఆడిన మ్యాచ్‌లో 16 పరుగులకే అవుట్ అయ్యాడు..
హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించే అవకాశం రాలేదు. బంగ్లాదేశ్, మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో వరుస పరాజయాలు అందుకుంది. నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుని, టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది..
బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయంతో బాధపడుతుండడంతో అతని స్థానంలో నజ్ముల్ హుస్సేన్ షాంటో, నేటి మ్యాచ్‌లో బంగ్లాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
బంగ్లాదేశ్ జట్టు: లిటన్ దాస్, తన్జీద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తోహిద్ హృదయ్, ముస్తాఫికర్ రహీం, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహ్ముద్, ముస్తాఫికర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం
భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్