మామ రికార్డుపైనే కన్నేసావా అల్లుడు..! ఫైనల్లోనే కొట్టేసేలా ఉన్నావే..: గిల్ పై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్..

By Arun Kumar PFirst Published Nov 19, 2023, 1:37 PM IST
Highlights

శుభ్ మన్ గిల్ ఈ ఏడాది(2023) లో భీకరమైన ఫామ్ తో పరుగుల వరద పారిస్తూ క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును బద్దలుగొట్టేందుకు సిద్దమయ్యాడు.  

హైదరాబాద్ : సచిన్ టెండూల్కర్ తర్వాత అలాంటి క్రికెటర్ మళ్లీ రాడని అందరూ అనుకున్నారు... కానీ విరాట్ కోహ్లీ వచ్చాడు. ఇప్పుడు కూడా కోహ్లీ తర్వాత అలాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడు అన్నారు... కానీ శుభ్ మన్ గిల్ దొరికాడు.  ఇలా దిగ్గజ క్రికెటర్ల స్పూర్తితో క్రికెటర్ గా మారిన యువకెరటం శుభ్ మన్ గిల్ ఇప్పుడు వారి రికార్డులనే బద్దలుగొట్టేందుకు సిద్దమయ్యాడు. అతడి టెక్నికల్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తుంటే ఎవ్వరి రికార్డులైనా బద్దలవ్వాల్సిందేనని అభిమానులు అంటున్నారు. 
  
శుభ్ మన్ గిల్ ఈ ఏడాది(2023) లో భీకరమైన ఫామ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు వన్డేల్లో 1580 పరుగులు పూర్తిచేసుకున్నాడు. మరో 31 పరుగులు చేస్తే ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డ్  సృష్టించనున్నాడు. 1996 లో సచిన్ టెండూల్కర్ 1611 పరుగులు చేసాడు... ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు ఇదే రికార్డ్... ఆ రికార్డును బద్దలుగొట్టడానికి గిల్ సిద్దమయ్యాడు.  

ఇప్పటికే విరాట్ కోహ్లీ 2011 లో సాధించిన 1381 పరుగులను గిల్ అధిగమించాడు. ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న చారిత్రాత్మన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోనే... తానెంతో ఇష్టపడే సచిన్, కోహ్లీల ముందే ఈ సరికొత్త రికార్డ్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో సూపర్ ఫామ్ లో వున్న గిల్ కేవలం 31పరుగులు సాధించడం పెద్ద కష్టంకాదని అభిమానులు అంటున్నారు. 

Read More  ICC World Cup Final 2023 : IND VS AUS ఫైనల్లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే... కొట్టాడో ఇండియా హిట్టే...

అయితే సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమలో వున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల యూఏఈ క్రికెటర్ చీరాగ్ సూరి వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారంటూ కామెంట్ కూడా చేసాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డుపై కన్నేసిన గిల్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ''మామ రికార్డుపైనే కన్నేసావా అల్లుడు'', ''మామకు తగ్గ అల్లుడు'', ''అల్లుడా మజాకా'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో తండ్రి సచిన్ రికార్డును కాబోయేవాడు బద్దలుగొడుతుంటూ సారా రియాక్షన్ చూడాలని అంటున్నారు. 
 

click me!