ఇంగ్లాండ్ చేతుల్లో 93 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన పాకిస్తాన్, 7వ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్, ఇంగ్లాండ్ రెండూ జట్లు లీగ్ స్టేజీని ముగించాయి. కోల్‌కత్తాలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది.. ఆఖరి రెండు మ్యాచుల్లో వరుస విజయాలు అందుకున్న ఇంగ్లాండ్, పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచి, నేరుగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.
అబ్దుల్లా షెఫీక్‌ని డేవిడ్ విల్లే డకౌట్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఫకార్ జమాన్ కూడా 9 బంతులు ఆడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 45 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 2 ఫోర్లతో 36 పరుగులు చేశాడు..
undefined
సౌద్ షకీల్ 29 పరుగులు చేయగా ఆఘా సల్మాన్ 45 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. ఇఫ్తికర్ అహ్మద్ 3, షాదబ్ ఖాన్ 4 పరుగులు చేసి అవుట్ కావడంతో 150 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్..
షాహీన్ ఆఫ్రిదీ 23 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా 11వ స్థానంలో వచ్చిన హారీస్ రౌఫ్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. మహ్మద్ వసీం జూనియర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు. మహ్మద్ వసీం, హారీస్ రౌఫ్ ఇద్దరూ కలిసి ఆఖరి వికెట్‌కి 53 పరుగులు జోడించి పాకిస్తాన్‌ని ఘోర ఓటమి నుంచి తప్పించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ మలాన్ 31 పరుగులు, జానీ బెయిర్‌స్టో 59 పరుగులు, జో రూట్ 60, బెన్ స్టోక్స్ 84, జోస్ బట్లర్ 27, హారీ బ్రూక్ 30, మొయిన్ ఆలీ 8, డేవిడ్ విల్లే 15 పరుగులు చేశారు.