46.4 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్.. హఫ్ సెంచరీలతో రాణించిన బాబర్ ఆజమ్, సౌద్ షకీల్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్తాన్, చెన్నైలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో మంచి స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, 46.4 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
అబ్దుల్లా షెఫీక్ 9, ఇమామ్ ఉల్ హక్ 12 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. 38 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది పాకిస్తాన్. ఈ దశలో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి మరోసారి పాక్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు..
undefined
మూడో వికెట్‌కి 48 పరుగులు జోడించిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, గెరాల్డ్ కాట్జీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇఫ్తికర్ అహ్మద్, బాబర్ ఆజమ్ కలిసి 43 పరుగులు జోడించారు..
31 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్, షంసీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో 65 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు..
హాఫ్ సెంచరీ తర్వాత షంసీ బౌలింగ్‌లో క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బాబర్ ఆజమ్. షాదబ్ ఖాన్, సౌద్ షకీల్ కలిసి ఆరో వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, గెరాల్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
52 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసిన సౌద్ షకీల్ కూడా షంసీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. మహ్మద్ నవాజ్ 24 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేయగా షాహీన్ ఆఫ్రిదీ 2 పరుగులు చేశాడు. ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన మహ్మద్ వసీం జూనియర్‌ని లుంగి ఎంగిడి అవుట్ చేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది..
మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీయగా తబ్రేజ్ షంసీ 4 వికెట్లు తీశాడు. గెరాల్డ్ కాట్జేకి 2 వికెట్లు దక్కగా లుంగి ఎంగిడికి ఓ వికెట్ దక్కింది.
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో సౌతాఫ్రికా 270+ పరుగుల లక్ష్యాన్ని ఒకే ఒక్కసారి ఛేదించింది. అది కూడా 2011లో టీమిండియాతో మ్యాచ్‌లోనే జరిగింది. కాబట్టి టార్గెట్ చిన్నగానే కనిపిస్తున్నా, సౌతాఫ్రికాకి మాత్రం అంత తేలికైన విషయం కాదు. అదీకాకుండా 2023 వన్డే వరల్డ్ కప్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన ఒకే ఒక్క మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతుల్లో ఓడింది సౌతాఫ్రికా..