Ind vs Eng: ఫైనల్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్.. వేట మొదలెట్టిన భారత బౌలర్లు

Published : Feb 05, 2022, 06:57 PM IST
Ind vs Eng: ఫైనల్ లో టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్.. వేట మొదలెట్టిన భారత బౌలర్లు

సారాంశం

ICC Under-19 World Cup 2022: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19  ప్రపంచకప్ ఫైనల్ లో  ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇది భారత్ కు వరుసగా నాలుగో ఫైనల్.   

24 ఏండ్ల దాహర్తిని తీర్చుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో టాస్ నెగ్గింది. అంటిగ్వా వేదికగా సర్ వివిన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న  తుది పోరులో ఆ జట్టు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐసీసీ నిర్వహించిన  రెండో ప్రపంచకప్ (1998) తర్వాత ఆ జట్టు మళ్లీ ఫైనల్ కు చేరలేదు. కాగా.. ఐదో ప్రపంచకప్ వేటలో ఉన్న భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. 

కాగా.. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది.  ఓపెనర్ జాకబ్ బెతాల్ (2) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన రవికుమార్.. కెప్టెన్ ప్రీస్ట్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ జార్జ్ థామస్ (18 నాటౌట్), జేమ్స్ రీ(1 నాటౌట్) ఆడుతున్నారు.  

 

గతేడాది దక్షిణాఫ్రికా వేదికగా  జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో భంగపడ్డ భారత్ ఈసారి మాత్రం   విశ్వ కప్ ను వీడేది లేదన్న పట్టుదలతో ఆడుతున్నది. టోర్నీ ఆసాంతం  ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నది. 

 

ఇటీవలే ముగిసిన ఆసియాకప్ నకు కొనసాగింపుగా అన్నట్టు.. ఈ  మెగా టోర్నీలో  లీగ్ దశలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఉగాండా, ఐర్లాండ్, సౌతాఫ్రికా ల పై నెగ్గి ఫైనల్స్ కు చేరింది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా  బంగ్లాదేశ్, కెనడా, యూఏఈ, సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్ లను ఓడించి తుది పోరుకు చేరుకున్నది.  

1988 లో తొలిసారి జూనియర్ ప్రపంచకప్ ను ప్రవేశపెట్టింది ఐసీసీ. తొలి  అండర్-19 ప్రపంచకప్ ను ఆసీస్ గెలుచుకుంది. కానీ పలు కారణాల రీత్యా ఆ తర్వాత 1998 దాకా రెండో ప్రపంచకప్ జరుగలేదు. 1988 ప్రపంచకప్ ను ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఇక ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి ఈ మెగా టోర్నీలో భారత్ ఎంట్రీ  ఇచ్చి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 2000లో నిర్వహించిన అండర్-19 ప్రపంచకప్ విజేత భారత్. 

భారత జట్టు :  అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యశ్ ధుల్ (కెప్టెన్), నిషాంత్ సింధు, రాజవర్ధన్ హంగర్గేకర్, దినేశ్ బన (వికెట్ కీపర్), కౌశల్  తాంబే, రాజ్ బవ, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్ 

ఇంగ్లాండ్ : జార్జ్ థామస్, జాకబ్ బెత్హాల్, టామ్ ప్రీస్ట్ (కెప్టెన్), జేమ్స్ రీ, విలియమ్ లక్స్టన్, జార్జ్ బెల్, రెహన్ అహ్మద్, అలెక్స్ హర్టన్ (వికెట్ కీపర్), థామస్ అస్పిన్వాల్, జోషువా బోయ్డెన్ 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?