చెప్పాల్సింది చాలా చెప్పా.. ఇక అనవసరం..! నరైన్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై పొలార్డ్ స్పందన ఇదే..

By team teluguFirst Published Oct 13, 2021, 6:24 PM IST
Highlights

ICC T20 World Cup: త్వరలో యూఏఈ వేదికగా జరుగబోయే డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రముఖ స్పిన్నర్ సునీల్ నరైన్ లేకపోవడంపై ఆ టీమ్ కెప్టెన్ కీరన్ పొలార్డ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్న ICC T20 Worldcup కోసం అన్ని జట్లు ఇప్పటికే తుది జట్లను ప్రకటించాయి.  డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ కూడా జట్టును ప్రకటించింది. అయితే ఇందులో ప్రముఖ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఈ విషయమై  West Indies టీ20 కెప్టెన్ కీరన్ పొలార్డ్  స్పందించాడు. 

విండీస్ టీ20 జట్టులో  Sunil Naraineను ఎందుకు తీసుకోలేదని Kieron Pollardను ప్రశ్నించగా అతడు మాట్లాడుతూ.. ‘దాని గురించి నేను ఇప్పటికే వివరించాను. ఒకవేళ నేను మళ్లీ దాని గురించి మాట్లాడితే అది విపరీత మెలికలు తిరుగుతుంది. ప్రస్తుతం షార్జాలో అతడు వేసిన బంతులు స్పిన్ తిరుగుతున్నదానికంటే నా మాటలు ఇంకా ఎక్కువ వంపులు తిరుగుతాయి. ఇప్పుడు మా జట్టులో ఉన్న సభ్యుల గురించి మాట్లాడుకుందాం’ అని అన్నాడు. 

ఇది కూడా చదవండి: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు.. తీవ్ర నిరాశలో ఉన్నా.. మనసులో బాధ బయటపెట్టిన వార్నర్ భాయ్

అంతేగాక నరైన్ విషయంలో ఇప్పటికే చెప్పాల్సింది చాలా చెప్పామని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. ‘నేను ఆ విషయంలో  స్పందించదలుచుకోలేదు. ఇప్పటికే దానిమీద నా అభిప్రాయమేమిటో చెప్పేశాను. నేనేగాక బోర్డు సభ్యులు కూడా దానిమీద క్లారిటీ ఇచ్చేశారు.

ఆటగాడి కంటే ముందు నరైన్ నాకు మిత్రుడు. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందే మేమిద్దరం క్రికెట్ ఆడుకుంటూ పెరిగాం. అతడు ప్రపంచ స్థాయి క్రికెటర్. అందులో సందేహమే లేదు’ అని పొలార్డ్ చెప్పాడు. 

ఇది కూడా చదవండి: IPL2021 DC vs KKR: ఈసారి కప్ మాదే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టైటిల్ ఎలా గెలవగలదో చెప్పిన పాంటింగ్

కాగా IPLలో Kolkata knight Riders తరఫున ఆడుతున్న సునీల్ నరైన్..  ప్లేఆఫ్స్ వరకు పడుతూ లేస్తూ వచ్చిన ఆ జట్టుకు బూస్ట్ ఇచ్చే విజయం అందించాడు. రెండ్రోజుల క్రితం Royal Challengers Bangloreతో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లో నాలుగు కీలక వికెట్లు తీసిన నరైన్.. బ్యాటింగ్ లోనూ ఇరగదీశాడు. ఆర్సీబీ బౌలర్ డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్ లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్ ను కోల్కతా వైపునకు తిప్పాడు.  దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ కోల్కతా వశమైంది. ఐపీఎల్-14 సీజన్ ఆసాంతం రాణించిన నరైన్.. విండీస్ టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.

click me!