T20 World cup: ఇకచాలు.. అతడికంటే తోపు బౌలర్లున్నారు.. టీమిండియా సీనియర్ బౌలర్ పై మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్

Published : Nov 05, 2021, 03:34 PM IST
T20 World cup: ఇకచాలు.. అతడికంటే తోపు బౌలర్లున్నారు.. టీమిండియా సీనియర్ బౌలర్ పై మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

India Vs Scotland: టీమిండియా టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్లు టెస్టుకు పనికొస్తారేమో గానీ..  పొట్టి ఫార్మాట్ కు అస్సలు సూట్ కారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

టీ20 ప్రపంచకప్ (Mohammed Shami) లో నేడు స్కాట్లాండ్ తో  ఇండియా  (India Vs Scotland) కీలక మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా (Team India) టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్లు టెస్టుకు పనికొస్తారేమో గానీ..  పొట్టి ఫార్మాట్ కు అస్సలు సూట్ కారంటూ కామెంట్స్ చేశాడు. 

సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘టీ20 టీమ్ విషయంలో భారత్ ఒకసారి ఈ జట్టుపై ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా కొంత మంది ఆటగాళ్లు ఈ ఫార్మాట్ కంటే మిగతా ఫార్మాట్ కు పనికొస్తారు.  వారి స్థానంలో కొత్త రక్తాన్ని జట్టులోకి నింపాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది జట్టుకు లాభిస్తుంది కూడా.  అవును.. నేను మహ్మద్ షమీ (mohammed shami) గురించే మాట్లాడుతున్నాను..’ అని అన్నాడు. 

‘నా దృష్టిలో షమీ  భారత క్రికెట్ కు గొప్ప ఆస్తి. మంచి నాణ్యమైన బౌలర్ కూడా. అయితే అది టెస్టు మ్యాచ్ ల వరకే పరిమితం. టీ20 లలో అతడి (షమీ) ఎకానమీ చూడండి. 9 (9.79) కి చేరింది. రెండ్రోజుల క్రితం అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో అతడు బాగా ఆడి ఉండొచ్చు కానీ.. టీ20లలో షమీ కంటే బాగా బౌలింగ్ చేసే బౌలర్లు మనకున్నారు’ అని కామెంట్ చేశాడు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తో మ్యాచ్ లో తేలిపోయిన షమీ.. అఫ్గాన్ తో  మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేశాడు.  ఈ మ్యాచ్ లో షమీ 3 వికెట్లు తీశాడు. 

ఇవీ చదవండి : Happy Birthday Virat Kohli: కింగు బర్త్ డే కదా.. ఆ మాత్రం ఉంటది మరి..! ట్వీట్లతో పోటెత్తుతున్న ట్విట్టర్

T20 World cup: ఇండియాకు షాకిస్తామంటున్న స్కాట్లాండ్ కెప్టెన్.. తుక్కుతుక్కుగా ఓడించాలని చూస్తున్న భారత్..

ఇదిలాఉండగా.. భారత్ తరఫున 54 టెస్టులాడిన షమీ.. 195 వికెట్లు తీశాడు. 79 వన్డేలు ఆడి 148 వికెట్లు తీశాడు. ఇక టీ20లలో అతడు.. 15 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.  వన్డే, టెస్టులలో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన షమీ.. టీ20లలో తేలిపోతున్నాడు. సంజయ్ మంజ్రేకర్ ఇదే విషయాన్ని తన వ్యాఖ్యల్లో ఎత్తి చూపాడు. 

కాగా..  ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో  భాగంగా నేడు సాయంత్రం 7:30 గంటలకు ఇండియా.. స్కాట్లాండ్ ను ఢీకొనబోతున్నది. మరోవైపు నమీబియా.. న్యూజిలాండ్ (Newzealand vs Namibia) తో తలపడబోతున్నది. ఒకవేళ నమీబియా గానీ న్యూజిలాండ్ కు షాకివ్వగలిగితే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచినట్టే. న్యూజిలాండ్.. తన చివరి మ్యాచ్ అఫ్గానిస్థాన్ తో ఆడనున్నది. ఈ నెల 7న ఇండియా.. సెమీస్ రేసులో ఉంటుందా..? లేదా..? అనేదానిమీద స్పష్టత రానున్నది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !