ICC ODI World Cup 2023: నేడే భారత జట్టు ప్రకటన.. ఆ 15 మంది ఎవరు?.. కేఎల్‌ రాహుల్‌కు గ్రీన్ సిగ్నల్!

Published : Sep 05, 2023, 12:20 PM ISTUpdated : Sep 21, 2023, 11:41 AM IST
ICC ODI World Cup 2023: నేడే భారత జట్టు ప్రకటన.. ఆ 15 మంది ఎవరు?.. కేఎల్‌ రాహుల్‌కు గ్రీన్ సిగ్నల్!

సారాంశం

ఐసీపీ వన్డే వరల్డ్ కప్ 2023 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి భారత జట్టను నేడు ప్రకటించనున్నారు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టును ప్రకటించబోతోంది.

ICC ODI World Cup 2023: ఐసీపీ వన్డే వరల్డ్ కప్ 2023 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి భారత జట్టను నేడు ప్రకటించనున్నారు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టును ప్రకటించబోతోంది. మధ్యాహ్నం 1.30 గంటల  తర్వాత ఈ ప్రకటన వెలువడనుంది. అయితే వన్డే వరల్డ్ కప్‌కు ఆడే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టను దాదాపుగా ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేయడం ఖాయం. 

అయితే ఆసియా కప్‌కు 17 మందిని ఎంపిక చేయగా.. వరల్డ్ కప్‌కు 15 మందిని ఎంపిక చేయనున్నారు. దీంతో ఆసియా కప్‌కు ఎంపికైన జట్టులో నుంచి పక్కన బెట్టే ఆ ఇద్దరు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లతో జట్టును ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే కేఎల్ రాహుల్‌ ఫిట్‌నెస్‌పై ఇంకా కొంత సందిగ్దత నెలకొంది. జాతీయ క్రికెట్‌ అకాడమీ అతడికి పచ్చజెండా ఊపిందన్న వార్తల నేపథ్యంలో తన  ఎంపికా ఖాయం అనుకోవచ్చు. అయితే ఈ విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయం కానుంది. రాహుల్ ఎంపిక ఖాయమైతే.. తిలక్ వర్మను పక్కకు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆసియా కప్‌కు రాహుల్ బ్యాకప్‌గా ఎంపికైన శాంజు శాంసన్‌ను కూడా అవకాశం ఉండదు. ఇక, ప్రస్తుతం ప్రకటించే జట్టులో ఎవరికైనా ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తితే సెప్టెంబరు 25 లోపు జట్టులో మార్పులు చేసే అవకాశం బీసీసీఐకి ఉంది.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు