భారత్ బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు..రవిశాస్త్రి సెటైర్లు..!

Published : Sep 05, 2023, 09:37 AM IST
భారత్ బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు..రవిశాస్త్రి సెటైర్లు..!

సారాంశం

వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియాకి 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు అంపైర్లు. దీంతో చాలా సునాయాసంగా గెలిచేశారు.  

ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా సూపర్ 4 స్టేజీకి చేరుకుంది. పాక్‌తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయినా, నేపాల్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది భారత జట్టు. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియాకి 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు అంపైర్లు. దీంతో చాలా సునాయాసంగా గెలిచేశారు.

231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 10 వికెట్ల (డీఎల్‌ఎస్) విజయాన్ని నమోదు చేయడంతో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచారు. అయితే, భారత క్రికెట్ జట్టుకు అంతా సాఫీగా సాగలేదు. రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత, భారత ఫీల్డర్లు మైదానంలో పెద్దగా యాక్టివ్ గా లేరు. మొదట్లోనే మూడు అవకాశాలను వదులుకున్నారు. ఈ విషయంపై  భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రికి మ్యాచ్ ప్రారంభంలో భారత్ 'బాడీ లాంగ్వేజ్' నచ్చలేదు.

మ్యాచ్ మొదలైన సమయంలో  కౌచ్ లు మిస్ అయ్యాయని, బాడీ లాంగ్వేజ్ ఫ్లాట్ గా అనిపించింది అని రవిశాస్త్రి చెప్పారు. వారు మళ్లీ యాక్టివ్ కావడానికి, ఆ మూడు క్యాచులు మిస్ చేయాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో నేపాల్ ఓపెనర్లు బాగా రాణిస్తున్నారని, జడేజా వచ్చి మ్యాచ్ ని తిప్పేశాడని చెప్పారు.

భార‌త్‌పై నేపాల్ బ్యాటింగ్‌ను కూడా కొనియాడాడు. నేపాల్ బౌలర్లు కూడా చాలా బాగా ఆడారని గుర్తు చేశారు. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?