పురుషులతో సమానంగా మహిళా క్రికెట్ టోర్నీలకు ప్రైజ్ మనీ... ఐసీసీ సరికొత్త ఆలోచన...

Published : Jul 13, 2023, 11:01 PM IST
పురుషులతో సమానంగా మహిళా క్రికెట్ టోర్నీలకు ప్రైజ్ మనీ... ఐసీసీ సరికొత్త ఆలోచన...

సారాంశం

సౌతాఫ్రికాలోని డర్భన్‌లో జరిగిన వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ... ఐసీసీ ఈవెంట్లతో పురుషులతో సమానంగా మహిళలకు రివార్డులు.. టెస్టు స్లో ఓవర్ రేటు నిబంధనల్లో మార్పులు.. 

క్రికెట్‌ని జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తారు. అందులో మెన్ ఉన్నట్టే, క్రికెట్‌లో పురుషాధిక్యం చాలా ఎక్కువే. టీమిండియాలో A+ కాంట్రాక్ట్‌లో ఉన్న పురుష క్రికెటర్లకు ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తున్న బీసీసీఐ, A సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన భారత మహిళా క్రికెటర్లకు మాత్రం ఏడాదికి రూ.50 లక్షలు చెల్లిస్తోంది...

పురుషుల క్రికెట్ ద్వారా వస్తున్న ఆదాయంతోనే మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లిస్తున్నామని ప్రకటిస్తూ వచ్చింది బీసీసీఐ. గత రెండేళ్లుగా మహిళా క్రికెట్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కి కూడా మంచి వ్యూయర్‌షిప్ వచ్చింది. అయితే ఈ ఏడాది ప్రకటించిన మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ల్లో కూడా ఎలాంటి పురోగతి రాలేదు..

అయితే పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ ఆలోచనతో ఇప్పుడు ఐసీసీ కూడా మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం ఓ అడుగు ముందుకు వేసింది. ఐసీసీ ఈవెంట్లలో ఇకపై పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకు కూడా ప్రైజ్‌మనీ చెల్లించబోతున్నారు..

సౌతాఫ్రికాలో డర్భన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బోర్డు సభ్యులు. ‘ఇది క్రికెట్ చరిత్రలోనే ఓ ముఖ్యమైన ఘట్టం. ఇకపై ఐసీసీ ఈవెంట్లలో పోటీపడే పురుషల క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా రివార్డులు, ప్రైజ్‌మనీ అందచేస్తామని ప్రకటించడం గర్వంగా ఉంది..’ అంటూ ఐసీసీ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో తెలిపాడు ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్‌క్లే..

‘2017 నుంచి మహిళా క్రికెట్ ఈవెంట్లకు ప్రైజ్‌మనీని పెంచుతూ వస్తున్నాం. సమానమైన ప్రైజ్‌మనీ తీసుకురావాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌, ఐసీసీ పురుషుల వరల్డ్ కప్‌లకు సమానమైన రివార్డులు, ప్రైజ్ మనీ ఉంటాయి. టీ20 వరల్డ్ కప్స్, అండర్19 వరల్డ్ కప్స్‌లోనూ ఇదే రూల్ వర్తిస్తుంది.. ’ అంటూ స్టేట్‌మెంట్‌లో తెలిపింది ఐసీసీ..

టెస్టు క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేటు జరిమానాలో మార్పులు చేసింది ఐసీసీ. ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 నుంచి తక్కువగా వేసే ఒక్కో ఓవర్‌కి టీమ్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం ఫైన్ విధిస్తారు. 10 ఓవర్లు తక్కువగా వేస్తే 50 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్ కింద కట్టాల్సి ఉంటుంది..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా 100 శాతం మ్యాచ్ ఫీజును ఫైన్ రూపంలో చెల్లించగా, ఆస్ట్రేలియా టీమ్ 80 మ్యాచ్ ఫీజును కోల్పోయింది. ఇకపై ఇది 50 శాతానికే పరిమితం కానుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !