మ‌నోడి ఆట‌ను బెన్ డకెట్ చూడ‌లేద‌నుకుంటా.. బాజ్‌బాల్‌కు రోహిత్ శ‌ర్మ స్ట్రాంగ్‌ కౌంటర్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 6, 2024, 8:36 PM IST

Rohit Sharma's counter for England:  ‘మా జట్టులో రిషభ్‌ పంత్ అనే ఆట‌గాడు ఉండేవాడు. బహుశా మ‌నోడు ఆడేప్పుడు బెన్‌ డకెట్‌ చూసి ఉండడేమో..’అంటూ  ఇంగ్లాండ్ బాజ్‌బాల్‌కు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కౌంట‌ర్ ఇచ్చాడు.
 


Rohit Sharma's counter for bazball: ఇంగ్లాండ్ ఓపెనర్‌ బెన్‌ డకెట్ టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందిస్తూ ఇంగ్లాండ్ బాజ్‌బాల్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చాడు. నిజానికి, మూడవ టెస్టు ముగిసిన త‌ర్వాత జైస్వాల్ ఆట‌తీరును బెన్ డ‌కెట్ ప్రశంసించాడు. అయితే, అతని దూకుడు బ్యాటింగ్ శైలిని ఇంగ్లాండ్ బాజ్‌బాల్ నుంచి నేర్చుకున్న పాఠంగా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ దూకుడు క్రికెట్ (బాజ్‌బాల్ గేమ్) ఆడుతుండడం చూసి ఇతర జట్లు కూడా దానిని అవలంబిస్తున్నాయని డకెట్‌ చెప్పాడు. "యశస్వి జైస్వాల్ మా దగ్గరే నేర్చుకున్నారు. ఇప్పుడు చాలా మంది క్రికెట‌ర్లు ఇప్పుడు త‌మ ఆట‌తీరును అనుస‌రిస్తున్నార‌ని' పేర్కొన్నాడు.

అయితే, య‌శ‌స్వి జైస్వాల్ పై బెన్ డ‌కెట్ చేసిన కామెంట్స్ పై స్పందించిన హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ.. ఇంగ్లాండ్ బాజ్ బాల్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో టెస్టు క్రికెట్‌లో ఎన్నో మ్యాచ్‌లు గెలిచి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ పంత్‌ను రోహిత్ శ‌ర్మ గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ లోనే వారి బౌలింగ్ ను ఉతికిపారేసిన రిష‌బ్ పంత్ ఆడుతున్న‌ప్పుడు బ‌హుశా బెన్ డ‌కెట్ చూసివుండ‌క‌పోవ‌చ్చున‌ని కౌంట‌ర్ ఇచ్చాడు. దూకుడు బ్యాటింగ్ తాము ఎవ‌రివ‌ద్ద నుంచి నేర్చుకోలేద‌నే, దాని రుచిని ఎప్పుడో తాము చూపించామ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 'మా జట్టులో ఒక ఆటగాడు ఉండేవాడు, అతని పేరు రిషబ్ పంత్. బెన్ డకెట్ అతను ఆడటం చూడలేదని నేను అనుకుంటున్నాన' అని అన్నాడు. కాగా, ఇంగ్లాండ్ తో  జరుగుతున్న సిరీస్‌లో యశస్వి జైస్వాల్ టాప్ స్కోరింగ్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. ఇప్పటివరకు, అతను నాలుగు మ్యాచ్‌లలో 94.57 సగటుతో, 78.63 స్ట్రైక్-రేట్‌తో 655 పరుగులు చేశాడు.

Latest Videos

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల కంటే ఎక్కువ వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

డ‌కెట్ కామెంట్స్ పై మాజీ ఇంగ్లాండ్ దిగ్గ‌జం నాసిర్ హుస్సేన్ సైతం అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జైస్వాల్ త‌మ నుంచి (బాజ్ బాల్) దూకుడు బ్యాటింగ్ నేర్చుకోలేద‌నీ, అత‌ను త‌న ప‌రిస‌రాల్లో.. తాను ఎదుగుతున్న క‌ష్ట‌ప‌డుతూ.. ఐపీఎల్ గేమ్ నుంచి నేర్చుకున్నాడ‌నీ, ఏది జ‌రిగినా దానిని నుంచి నేర్చుకుంటునే ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. అలాగే, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా డకెట్ ప్రకటనపై అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఇష్ట‌మ‌ట‌.. ! జాన్వీ కపూర్ అభిమాన క్రికెటర్ ఎవ‌రంటే..?

click me!