Virat Kohli: నీతో కలిసి నేను బ్యాటింగ్ చేయలేను.. నా వల్ల కాదు.. కోహ్లి పై కొత్త పెళ్లికొడుకు గుస్సా

Published : May 05, 2022, 04:30 PM IST
Virat Kohli: నీతో కలిసి నేను బ్యాటింగ్ చేయలేను.. నా వల్ల కాదు.. కోహ్లి పై కొత్త పెళ్లికొడుకు గుస్సా

సారాంశం

TATA IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ మాజీ సారథి విరాట్ కోహ్లితో తాను బ్యాటింగ్ చేయలేనని అంటున్నాడు కొత్త పెళ్లికొడుకు, ఆ జట్టు  ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్. కోహ్లి మాదిరిగా సింగిల్స్, డబుల్స్ తీయడం తన వల్ల కాదంటున్నాడు. 

ఐపీఎల్-15లో భాగంగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత  బ్యాటింగ్ చేసిన బెంగళూరు..  తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టింది.  ప్లేఆఫ్  రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో   నెగ్గడంతో డ్రెస్సింగ్ రూమ్ లో  ఆనందాలు వెల్లివెరిశాయి. అయితే  ఆ జట్టులో బ్యాటింగ్ చేసేప్పుడు మ్యాక్స్వెల్ ను రనౌట్ చేసిన కోహ్లి  పై అతడు గుస్సా అయ్యాడు.   కోహ్లితో తాను బ్యాటింగ్ చేయలేనని, అతడిలాగా సింగిల్స్, డబుల్స్ తీయడం తన వల్ల కాదని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను  ఆర్సీబీ తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. 

తన రనౌట్ గురించి మ్యాక్సీ మాట్లాడుతూ.. ‘నేను నీతో కలిసి బ్యాటింగ్ చేయలేను. నావల్ల కాదు. నువ్వు చాలా వేగంగా పరిగెత్తుతావు.  అంత వేగంగా నేను పరిగెత్తలేను.. నీకులా సింగిల్స్, డబుల్స్ తీయడం మనతోని కాదు...’అని అన్నాడు. 

ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు కోహ్లి కూడా అక్కడే ఉన్నాడు. అది చూసిన కోహ్లి.. ‘వీడేంటి నన్ను తగులుకున్నాడు..’ అన్నట్టుగా ముఖం పెట్టాడు. బ్యాట్ ను సర్దుకుంటూ ‘ఇక్కడ్నుంచి వెళ్లిపోతే బెటర్..’ అన్నట్టుగా అటూ ఇటూ చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

బెంగళూరు బ్యాటింగ్ చేస్తుండగా డుప్లెసిస్ ఔట్ అయ్యాక వన్ డౌన్ లో వచ్చిన మ్యాక్స్వెల్.. మూడు బంతులే ఎదుర్కుని 3 పరుగులు చేశాడు. అయితే జడేజా వేసిన 9వ ఓవర్లో కోహ్లి అనవసర పరుగు కోసం యత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న మ్యాక్సీ..  క్రీజును వీడాడు. అప్పటికే బంతిని అందుకున్న రాబిన్ ఊతప్ప.. ధోనికి త్రో వేశాడు. ధోని బంతిని అందుకోవడం, స్టంప్స్ ను పడగొట్టడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. 

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే..  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లోమ్రర్ (42), డుప్లెసిస్ (38) రాణించారు. అనంతరం 174 పరుగుల లక్ష్య ఛేదనలో  చెన్నై.. 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (56), మోయిన్ అలీ (34) రాణించినా..మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా 13 పరుగుల తేడాతో ఆర్సీబీని విజయం వరించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన