IPL 2022 CSK VS RCB: స్టాండ్‌లో రెచ్చిపోయిన ప్రేమ‌జంట‌.. మోకరిల్లి ప్రేమికుడికి ప్రపోజ్.. ఆ త‌రువాత హగ్ ..

Published : May 05, 2022, 01:26 AM IST
IPL 2022 CSK VS RCB: స్టాండ్‌లో రెచ్చిపోయిన ప్రేమ‌జంట‌.. మోకరిల్లి ప్రేమికుడికి ప్రపోజ్.. ఆ త‌రువాత హగ్ ..

సారాంశం

IPL 2022 CSK VS RCB: పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ లో ఆస‌క్తికర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ ప్రేమికుల జంట అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఒక అమ్మాయి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఆశ్చ‌ర్యానికి గురైన ఆ ప్రియుడు ఆమెకు అంగీక‌రించి కౌగిలించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.  

IPL 2022 CSK VS RCB: ఐపీఎల్  అంటేనే అభిమానుల హంగామా.. త‌మ ఫేవ‌రేట్ టీం ఆడుతున్న‌.. త‌మ ఫేవ‌రేట్ ఆడ‌గాడు వికెటో లేదా బౌండ‌రీ బాదిన వారి సంద‌డి మామాలుగా ఉండ‌దు. త‌మ ఇష్టానూసారంగా అభిమానాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ ఆట‌గాళ్ల‌ను ఉత్స‌హ‌ప‌రుస్తాయి. అయితే..  RCB Vs CSK  ఆట‌ సమయంలో స్టాండ్లో ఓ ఆస‌క్తి ర‌క ఘ‌ట‌న చోటు చేసింది. ఓ RCB అభిమాన జంట చేసిన ప‌నిని చూసి.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ఏం జ‌రిగింది. నెట్టింట్లో ఎందుకు వైర‌ల్ మారింద‌ని అనుకుంటున్నారా..? 

వివ‌రాల్లోకెళ్తే... పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ జోరుగా సాగుతోంది. CSK  రన్-ఛేజ్ సమయంలో.. అది దాదాపు 11వ ఓవర్. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై జట్టు శుభారంభం చేసినా పవర్ ప్లే అనంతరం స్వల్ప వ్యవధిలో చాలా వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్లో స్పిన్ బౌలర్ ఎదుర్కొని ముందు చెన్నై బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కెమెరా స్టాండ్ వైపు మళ్లింది. 

ఈ క్ర‌మంలో బెంగళూరు అభిమానుల  బృందం ఒక చోట గుమిగూడింది. ఇంత‌లో RCB టీషర్ట్ ధరించిన ఓ అమ్మాయి మోకాళ్లపై కూర్చొని తన ప్రియుడికి ప్రపోజ్ చేస్తోంది. ప్రియురాలి ఇచ్చిన స‌ర్ ప్రైజ్ కు   కాసేపు ఆశ్చర్యపోతాడు ఆ ప్రియుడు. ఆ తర్వాత చిరునవ్వుతో ప్రేమ ప్రతిపాదనను అంగీకరించి చేయి చాచాడు. అమ్మాయి తన కోరికను కోరుకున్నట్లుగా పొందుతుంది. ఆమె అనంత‌రం తన ప్రేమికుడికి ఉంగరాన్ని పొడిగింది. దీని తర్వాత అబ్బాయి ప్రియురాలిని కౌగిలించుకున్నాడు. ఆసక్తికరమైన క్షణం చూసిన వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడూ ఈ ఘ‌ట‌న సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. అనేక మంది క్రికెట్ అభిమానులు ఆ జంట‌కు అభినంద‌లు తెలుపుతూ.. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.  

ఈ ఘ‌ట‌న‌పై భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా త‌న‌దైన శైలిలో కామెంట్ చేశారు. RCBకి విధేయుడిగా ఉండగలిగితే, అతను నిస్సందేహంగా తన ప్రేయసికి విధేయుడిగా ఉంటాడని జాఫర్ వ్యాఖ్యానించడం విశేషం.  
 
RCB vs CSK  : 13 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ 2022 (ఐపీఎల్ 2022) 49వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ముఖ్యమైనది, దీని కారణంగా ఆటగాళ్లు గెలవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హర్షల్ పటేల్, గ్లెన్ మాక్స్‌వెల్ క్లినికల్ బౌలింగ్ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ను IPLలో ఎలిమినేషన్ అంచుకు నెల‌బ‌డింది.

RCB బ్యాటింగ్ లో మహిపాల్ లోమ్రోర్ 27 బంతుల్లో 42 పరుగులు చేయ‌గా.. ఫాఫ్ డు ప్లెసిస్ (22 బంతుల్లో 38 పరుగులు), విరాట్ కోహ్లీ (33 బంతుల్లో 30), దినేష్ కార్తీక్ (17 నాటౌట్ 27) రాణించడంతో RCB 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్‌సిబి బౌలర్లు డిఫెండింగ్ ఛాంపియన్‌లను 8 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితం చేశారు. ఓపెనర్ డెవాన్ కాన్వే (56) ఫిఫ్టీ చేసినప్పటికీ..మాక్స్‌వెల్ తన నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లతో అద్భుతమైన ఆటతీరుతో ముగించగా, హర్షల్ 35 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన