నాకొచ్చిందే మూడు ముక్కలు.. అదీ మాట్లాడేశా.. ఇక నీకో దండం : ఇంగ్లీష్ రాక పాక్ పేసర్ ఇబ్బందులు.. వీడియో వైరల్

By Srinivas MFirst Published Nov 30, 2022, 12:38 PM IST
Highlights

PAK vs ENG: విలేకరుల సమావేశంలో భాగంగా  పాకిస్తాన్ పేసర్ నసీమ్ షా తన మాట్లాడుతుండగా   ఓ జర్నలిస్టు లేచి ఇంగ్లాండ్ వెటరన్ పేసర్  జేమ్స్ అండర్సన్ గురించి  ప్రశ్న అడిగాడు.  దానికి నసీమ్ షా సమాధానం చెబుతూ.. 

టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ మళ్లీ తమ క్రికెట్ ను మొదలుపెట్టింది.  ఫైనల్ లో తమను ఓడించిన ఇంగ్లాండ్ తో  తిరిగి స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది.  డిసెంబర్ 1 నుంచి రావల్పిండి వేదికగా  ఇంగ్లాండ్ - పాక్ మధ్య తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పాత్రికేయు సమావేశానికి వచ్చిన పాకిస్తాన్ యువ పేసర్  నసీమ్ షా వచ్చీరాని ఇంగ్లీష్ తో ఇబ్బందిపడ్డాడు.  ఇక తన వల్ల కాదనుకుని.. ‘నాకొచ్చిన ఇంగ్లీష్ మాట్లాడేశా. ఇక నా వల్ల కాదు..’ అని  చేతులెత్తేశాడు.  ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

విలేకరుల సమావేశంలో భాగంగా  నసీమ్ షా తన మాట్లాడుతుండగా   ఓ జర్నలిస్టు లేచి ఇంగ్లాండ్ వెటరన్ పేసర్  జేమ్స్ అండర్సన్ గురించి  ప్రశ్న అడిగాడు.  దానికి నసీమ్ షా సమాధానం చెబుతూ.. ‘ఆయన లెజెండ్. ఒక ఫాస్ట్ బౌలర్ 40 ఏండ్ల వరకు ఆడటం..  ఇప్పటికీ గొప్పగా రాణిస్తుండటం మామూలు విషయం కాదు.. 

ఆయనను మేం కలిసినప్పుడు కూడా ఇదే మాట్లాడుతుంటాం.  నలభై ఏండ్ల వయసులో కూడా  ఆయన తన స్కిల్స్ తో  వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా రాణించడం  చాలా పెద్ద అచీవ్మెంట్..’ అని అన్నాడు. ఈ సమాధానం ఇంగ్లీష్ లోనే ఇచ్చాడు.  అయితే నసీమ్ షా  సమాధానం పూర్తయ్యాక సదరు జర్నలిస్టు మళ్లీ  అండర్సన్ స్కిల్స్ గురించిన  ప్రశ్న అడగబోయాడు. 

దానికి షా అతడిని మధ్యలోనే అడ్డుకుని.. ‘బ్రదర్.. నాకొచ్చిన 30 శాతం ఇంగ్లీష్ మాట్లాడేశా. అది కూడా అయిపోయింది. ఇంక నా వల్ల కాదు..’ అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.  సాధారణంగా ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి  వచ్చే ఆటగాళ్లు ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడతారు.   దీంతో  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినప్పుడు వాళ్లు  తమ తోడుగా  జట్టులో సీనియర్ ప్లేయర్ ను తీసుకుని వస్తారు.  తాజాగా నసీమ్ షా వచ్చీరాని ఇంగ్లీష్ తో  ఏకంగా పాత్రికేయుల సమావేశానికే   రావడం.. అక్కడ తానే నేరుగా ‘నాకు ఇంతకుమించి ఇంగ్లీష్ రాదు..’ అని చెప్పడం గమనార్హం.  ఇంగ్లీష్ రాకున్నా ఏదో గొప్పలకు పోకుండా నిజాయితీగా తనకు ఆ భాష రాదని చెప్పిన నసీమ్ షా పై పాక్ ఫ్యాన్స్  ప్రశంసలు కురిపిస్తున్నారు.   

 

Never a dull moment with Naseem Shah ♥️ pic.twitter.com/yhdKl8T2km

— Farid Khan (@_FaridKhan)

పాకిస్తాన్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ : 

- డిసెంబర్ 1 నుంచి 05 వరకు : రావల్పిండిలో తొలి టెస్టు 
- 09 నుంచి 13 వరకు : ముల్తాన్ లో రెండో టెస్టు 
- 17 నుంచి 21 వరకు : కరాచీలో మూడో టెస్టు 

click me!