ఒకరితో పోలిక వద్దు.. ఎప్పుడు రిస్క్ చేయాలో తెలుసు: విమర్శలకు ధావన్ చెక్

By Siva KodatiFirst Published Apr 30, 2021, 2:29 PM IST
Highlights

ప్రస్తుత ఐపీఎల్ 14వ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ.. మంచి పరుగులు సాధిస్తున్న వారిలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఒకడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కొనసాగించిన ఫామ్‌ను ప్రస్తుత సీజన్‌లో కూడా గబ్బర్ కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు

ప్రస్తుత ఐపీఎల్ 14వ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ.. మంచి పరుగులు సాధిస్తున్న వారిలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఒకడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో కొనసాగించిన ఫామ్‌ను ప్రస్తుత సీజన్‌లో కూడా గబ్బర్ కొనసాగిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కేకేఆర్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా ( 82) దూకుడుగా ఆడితే ధావన్‌ మాత్రం తన శైలికి భిన్నంగా (46) నెమ్మదిగా ఆడాడు. ఇది అభిమానులతో పాటు విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 

మ్యాచ్‌ అనంతరం ధావన్‌ మాట్లాడుతూ.. పృథ్వీ షాను ప్రశంసలతో ముంచెత్తాడు. అతని బ్యాటింగ్‌ అమోఘమని.. నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌ నుంచి అతడి బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేశానని తెలిపాడు. మా ఇద్దరి భాగస్వామ్యం బాగుందని.. తాను రిస్క్‌ షాట్లు  కొడదామని ఆలోచించలేదని ధావన్ అన్నాడు.  

Also Read:ధావన్, దినేశ్ కార్తీక్ ల మధ్య ఏం జరిగింది..?

ఆట పరిస్థితిని బట్టే బ్యాటింగ్‌ చేశానని.. తాను ఎవరితోనూ పోల్చుకోనని... పరిస్థితిని బట్టే నా ఆటతీరు ఉంటుందని తేల్చిచెప్పాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో తాను అదే చేశానని.. స్టైక్‌ రేట్‌ను కాపాడుకుంటూ ఆడానని వెల్లడించాడు.

ఒక ఓపెనర్‌గా బరిలోకి దిగేముందు ఈ గేమ్‌కు రిస్క్‌ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తానని.. మనకు ఎప్పుడు రిస్క్‌ చేయాలో, ఎప్పుడు చేయకూడదో తెలిస్తే అది స్మార్ట్‌ క్రికెట్‌ అని గబ్బర్ అన్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో తనకు రిస్క్‌ చేసే అవసరం రాలేదని  ధావన్ తెలిపారు.  

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన ధావన్‌.. 311 పరుగులతో టోర్నీలోనే టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ హోల్టర్‌ అయిన ధావన్‌.. మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తానని వెల్లడించాడు.

click me!