Rohit Sharma : "ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఒక గది ఉంటుంది. కానీ నేను నా గదిని పంచుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల గురించి మీరు నన్ను అడిగితే, ఒకరు శిఖర్ ధావన్, మరొకరు రిషబ్ పంత్" అని చెబుతానంటూ రోహిత్ శర్మ అన్నాడు. హిట్ ఎందుకు ఇలా చెప్పాడు..?
Rohit Sharma : ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండవ ఎపిసోడ్ ఓటీటీ ప్లేట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ప్రాసారమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షోలో భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ లు కనిపించారు. మరోసారి కపిల్ శర్మ ప్రశ్నలతో.. ఈ ఇద్దరు స్టార్లు సరదాగా సమాధానాలు ఇస్తున్నారు. ఇందులో భారత స్టార్ ప్లేయర్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన రూమ్ ను ఇతరులతో షేర్ చేసుకోవడం ఇష్టముండదని పేర్కొన్న హిట్ మ్యాన్.. మన క్రికెటర్ల రహస్యాలను కూడా బయటపెట్టాడు.
తాను ఎవరితోనూ రూం షేర్ చేసుకోనని చెప్పిన రోహిత్ శర్మ.. దానికి సంబంధించిన వివరణతో షోలో నవ్పులు విరబూశాయి. మరీ ముఖ్యంగా తాను ఇద్దరు భారత ప్లేయర్లతో అస్సలు రూమ్ పంచుకోకూడదనే విషయంపై ఇచ్చిన సమాధానంతో ఈ వీడియో దృశ్యాలు చూసిన అభిమానులు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఏ ఆటగాడితోనైనా రూమ్ షేర్ చేసుకోవడం వస్తే.. రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లతో అస్సలు పంచుకోనని రోహిత్ శర్మ చెప్పాడు. అందరూ ఒక్కసారిగా ఎందుకు అనేలా షాకింగ్ లుక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ సంబంధిత కారణాలను వివరించడంలో అక్కడున్నవారందరూ నవ్వుకున్నారు.
KKR VS CSK HIGHLIGHTS : ఐపీఎల్ 2024లో కేకేఆర్ కు తొలి ఓటమి.. చెన్నై ఆల్ రౌండ్ షో..
కపిల్ శర్మ తన ఇద్దరు అతిథులు రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ లను మీరు ఎప్పుడూ గదిని పంచుకోవడానికి ఇష్టపడని ఆటగాడు ఎవరు? అని అడగ్గా.. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనీ, ఒకరు శిఖర్ ధావన్, మరొకరు రిషబ్ పంత్ అని చెప్పాడు. ఆ క్లిప్ లో రోహిత్ మాట్లాడుతూ .. 'నాకు అలా చేయడం ఇష్టం లేదు బ్రదర్. క్షమించండి. ఈ సందర్భంగా క్రికెటర్ చేతులు జోడించి కూడా కనిపించాడు.
దీనికి కారణాన్ని వివరిస్తూ,'చాలా మురికిగా ఉంటాయి. ప్రాక్టీస్ సెషన్ అయ్యాక వచ్చి రూమ్ లో బట్టలు ఇలా విసిరేస్తారు. అతని గది ఎల్లప్పుడూ డీఎన్నడీయే లో ఉంటుంది ఎందుకంటే వారు ఒంటి గంట వరకు నిద్రపోతారు. గదులను శుభ్రం చేయడానికి వచ్చే హౌస్ కీపర్లు.. కూడా డీఎన్ డీలో ఉండటం ముఖ్యం. అందుకే ఆ గది మూడు, నాలుగు రోజులు మురికిగానే ఉంటాయి. చుట్టుపక్కల వారు చాలా ఇబ్బందులు పడతారు. నేను వారితో కలిసి రండగలనని నేను అనుకోవడంలేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్.. ధోనిపై అప్పుడు విమర్శలు.. ఇప్పుడు గౌతమ్