ఆసియా కప్ : గ్రౌండ్ లో గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. ఆమె రియాక్షన్ ఏంటంటే...

Published : Sep 01, 2022, 09:20 AM IST
ఆసియా కప్ : గ్రౌండ్ లో గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్.. ఆమె రియాక్షన్ ఏంటంటే...

సారాంశం

బుధవారం జరిగిన ఇండియా వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్ లో ఓ అపురూపఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ బ్యాట్స్మెన్ కించిత్ తన గర్ల్ ఫ్రెండ్ కి గ్రౌండ్ లోనే ప్రపోజ్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.   

హాంకాంగ్ : ఆసియా కప్ -2022లో భాగంగా బుధవారం జరిగిన భారత హాంకాంగ్ మ్యాచ్ తర్వాత ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హాంకాంగ్ బ్యాట్స్ మెన్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. భారత్ తో మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్ లోకి వెళ్ళిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆమె ముంగిట మోకాళ్ళ మీద కూర్చుని తన ప్రేమను వ్యక్త పరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. 

Asia Cup: సూర్య బాదుడుకు విరాట్ వందనం.. మిస్టర్ 360 ఆటకు ఫిదా

కించిత్ చేసిన క్యూట్ ప్రపోజల్ కు ఆమెకూడా ఫిదా అయిపోయింది.  ఆ తర్వాత కించిత్, అతడి  ప్రేయసి ఒకరినొకరు కౌగలించుకొని ఆనందంలో మునిగితేలారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే…హాంగ్కాంగ్ పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్-4కు టీమిండియా అర్హత సాధించింది.  భారత విజయంలో సూర్య కుమార్, యాదవ్ (68 నాటౌట్), విరాట్ కోహ్లీ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగి కీలక పాత్ర పోషించారు.


 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే