Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు సన్ రైజర్స్ స్టార్ హైన్రిచ్ క్లాసెన్ గుడ్‌బై

Published : Jun 03, 2025, 04:30 PM ISTUpdated : Jun 03, 2025, 04:31 PM IST
Heinrich klaasen srh

సారాంశం

Heinrich Klaasen: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2018లో అరంగేట్రం చేసిన క్లాసెన్.. 3000లకు పైగా పరుగులతో కెరీర్ ముగించారు.

Heinrich klaasen retirement: దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్, ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్‌కు 2024లోనే గుడ్‌బై చెప్పిన క్లాసెన్, ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లను కూడా వదిలి పెట్టారు.

"ఇది నా కోసమే కానీ, చాలా బాధాకరమైన రోజు. నా కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం ఇది. ఇది చాలా కఠినమైన నిర్ణయం అయినా, నేను పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాను" అని క్లాసెన్ తెలిపారు. ఐపీఎల్ లో క్లాసెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నారు.

2018లో అరంగేట్రం చేసి 2025లోనే క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్లాసెన్

33 ఏళ్ల హెన్రిచ్ క్లాసెన్ 2018లో వన్డే, టీ20లతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. మొత్తం 60 వన్డేల్లో 2141 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత టాప్ స్కోర్ 174 పరుగులు. ఇవి ఆస్ట్రేలియావిపై 2023లో సాధించాడు. అలాగే, 58 టీ20 మ్యాచ్‌ల్లో 1000 పైగా పరుగులు చేశారు. టీ20ల్లో క్లాసెన్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 81 పరుగులు. 2022లో భారత్ పై ఈ పరుగులు సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో క్లాసెన్ చివరి మ్యాచ్‌లు ఎప్పుడు ఆడాడు?

హెన్రిచ్ క్లాసెన్ చివరి వన్డే మ్యాచ్ మార్చి 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఆడాడు. చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 2024లో పాకిస్తాన్‌తో ఆడాడు. దక్షిణాఫ్రికా టీమ్స్ డైరెక్టర్ ఇనాక్ మాట్లాడుతూ.. "క్లాసెన్ నిజమైన మ్యాచ్ విన్నర్. కొన్ని ఓవర్లలో ఆటను మలుపు తిప్పగల ఆటగాడు. అతని కృషికి ఎప్పటికీ కృతజ్ఞులం" అని తెలిపారు.

క్లాసెన్ రిటైర్మెంట్ పై కేశవ్ మహారాజ్ ఏమన్నారంటే?

తన టీమ్‌మేట్‌ క్లాసెన్‌ రిటైర్మెంట్ పై కేశమ్ మహారాజ్ స్పందిస్తూ, "అతను అత్యంత ధాటిగా ఆడగల ఆటగాడు. అతని సుదీర్ఘ ప్రస్థానం చాలా మందికి ప్రేరణగా ఉంటుంది. 2020లో ఆస్ట్రేలియాతో సిరీస్ అతని కెరీర్ మలుపుగా నిలిచింది" అన్నారు. తన ఫ్యూచర్ ప్లాన్ కు శుభాకాంక్షలు తెలిపాడు.

ఆసీస్ సిరీస్‌లో క్లాసెన్ మూడు వన్డేల్లో 242 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయాలు గుర్తు చేశారు. మొదటి మ్యాచ్‌లో 123* పరుగులు, తర్వాత 51, 68* పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు 3-0 విజయాన్ని అందించారు.

2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో  క్లాసెన్ సూపర్ నాక్

భారత్‌తో జరిగిన 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో క్లాసెన్ 27 బంతుల్లో 52 పరుగులతో మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు తీసుకువచ్చాడు. కానీ హార్దిక్ పాండ్యా ఓవర్‌లో ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ భారత్ చేతిలోకి వచ్చింది. దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో ఓడింది. “ఆ ఇన్నింగ్స్‌ లేకపోతే భారీ ఓటమి ఎదురయ్యేది” అని మహారాజ్ అన్నారు. “అతని అద్భుతమైన క్రికెట్ స్కిల్ ఏ స్థాయిలో ఉందో ఆ మ్యాచ్‌లో మరోసారి స్పష్టమైంది” అని తెలిపాడు.

హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్ గురించి మరింత మాట్లాడుతూ.. "ప్రోటీస్ జట్టు జెర్సీ ధరించడం నా కెరీర్‌లో గర్వకారణం. నా జీవితాన్ని మార్చిన ఆటగాళ్లకు, అభిమానులకు నా కృతజ్ఞతలు. నేను ఎప్పటికీ సౌతాఫ్రికాకు మద్దతుగా నిలిస్తాను" అని క్లాసెన్ చెప్పాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !