టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కి అనారోగ్యం..?

By telugu news teamFirst Published Jan 13, 2023, 9:31 AM IST
Highlights

గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే  శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అనారోగ్యం బారిన పడినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ద్రవిడ్ తన 50వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అయితే... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా లేనట్లు తెలుస్తోంది. టీమిండియా, శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే  శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా.. జనవరి13 శుక్రవారం జరుగనున్న మూడో వన్డే తిరువనంత పురంలో జరగనుంది. ఈ మ్యాచ్ కి వెళ్లాల్సిన ద్రవిడ్.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. 


ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక 2వ వన్డే మ్యాచ్‌కు ముందు ద్రవిడ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. టీమ్ హోటల్‌లో రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురైనట్లు వార్తలు వెలువచ్చాయి. వెంటనే చికిత్స అందించినట్లు తెలుస్తోంది. 

రెండవ ODIకి ముందు ద్రవిడ్ రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నాయని, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఏర్పాటు చేసిన వైద్యుడు ఆయనకు చికిత్స అందించినట్లు సమాచారం.  ద్రవిడ్ ఇప్పుడు తదుపరి పరీక్షల కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. అక్కడ చికిత్స తర్వాత.. వైద్యులు అనుమతి ఇస్తే.. ఆయన మళ్లీ జట్టుతో కలిసే అవకాశం ఉంది. 

click me!