
భారత ఆల్‌రౌండర్ నాలుగు నెలల గ్యాప్ తర్వాత కుటుంబాన్ని చేరుకున్నాడు. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన హార్దిక్ పాండ్యా, అటు నుంచి వన్డే, టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. క్వారంటైన్ పీరియడ్‌తో కలుపుకుని నాలుగు నెలల పాటు కొడుకు అగస్త్యకి దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా... ఈ సమయంలో బిడ్డ బాగా మిస్ అవుతున్నానంటూ చాలాసార్లు ప్రకటించాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అదరగొట్టిన హార్ధిక్, వన్డే, టీ20 సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన హార్ధిక్ పాండ్యా, టీ20 సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు.
కొడుకుకి పాలు తాగిస్తున్న ఫోటోను పోస్టు చేసిన హార్దిక్ పాండ్యా... ‘నేషనల్ డ్యూటీ నుంచి ఫాదర్ డ్యూటీకి...’ అంటూ కామెంట్ పెట్టాడు. జనవరిలో సెర్బియన్ నటి నటాశాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హార్ధిక్ పాండ్యాకి, జూలై 30న కొడుకు పుట్టాడు.
ఐపీఎల్ కోసం సెప్టెంబరులో యూఏఈ చేరిన హార్ధిక్ పాండ్యా... చాలాసార్లు కొడుకును గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ ట్రోఫీని బిడ్డను ఎత్తుకున్నట్టు ముద్దాడుతూ హార్దిక్ పాండ్యా దిగిన ఫోటో కూడా వైరల్ అయ్యింది.