హార్దిక్ నటాషాల క్యూట్ ఫోటో, గంటలో 70 లక్షల లైకులు

By Sreeharsha GopaganiFirst Published Jul 25, 2020, 7:06 PM IST
Highlights

తాజాగా  నటాషాతో ఉన్న మరో ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్. నీలి రంగు డ్రెస్ లో మెరిసిపోతున్న నటాషా వెనుక హార్దిక్ నిల్చొని ఇద్దరు కలిసి నటాషా గర్భం పై చేయి వేసి తమ ప్రేమ చిహ్నాన్ని చూసి సంతోషంతో ఫోటోకి పోజ్ ఇచ్చారు. 

త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న హార్దిక్ నటాషాల జంట ఈ మధ్యకాలంలో అభిమానులతో తమ ఫోటోలను పంచుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో హార్దిక్ పోస్ట్ చేస్తున్న ఫోటోలు కొద్దిసేపట్లోనే సూపర్ హిట్ అవుతున్నాయి. 

తాజాగా  నటాషాతో ఉన్న మరో ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు హార్దిక్. నీలి రంగు డ్రెస్ లో మెరిసిపోతున్న నటాషా వెనుక హార్దిక్ నిల్చొని ఇద్దరు కలిసి నటాషా గర్భం పై చేయి వేసి తమ ప్రేమ చిహ్నాన్ని చూసి సంతోషంతో ఫోటోకి పోజ్ ఇచ్చారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💝 Photographer- @rahuljhangiani Hardik’s stylist - @nikitajaisinghani Natasa’s stylist - @begborrowstealstudio

A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 25, 2020 at 12:22am PDT

ఇక హార్దిక్ ఈ ఫోటో షేర్ చేయగానే చాలా మంది సహచరులు లైకులు కొట్టారు. తెంన్నీస్ స్టార్ సానియా మీర్జా సైతం హార్ట్ ఎమోజితో రిప్లై ఇచ్చింది. చాలా మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం తమ ఆనందాన్ని తెలియజేశారు. 

ఈ ఫోటో ఎంత హిట్ అయ్యిందంటే... ఈ ఫోటోను షేర్ చేసిన గంటలోనే 70 లక్షల లైకులు సంపాదించింది. హార్దిక్ నటాషా లిద్దరు ప్రెగ్నన్సీ నుండి అనేక ఫోటో షూట్లలో పాల్గొంటూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 

ఇక క్రికెట్ విషయానికి వస్తే హార్దిక్ ఈ సెప్టెంబర్ నుండి ఆరంభమయ్యే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుఫున పాల్గొనబోతున్నారు. ఇకపోతే... క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ గురించి ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ తీపికబుర్లు చెబుతూనే ఉన్నాడు. 

టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా అనంతరం, ఐపీఎల్‌ యుఏఈలో పూర్తి స్థాయిలో జరుగనుందని వెల్లడించిన బ్రిజేశ్‌.. తాజాగా.... 51 రోజుల షెడ్యూల్‌తో ఐపీఎల్‌ 2020కి రంగం సిద్దమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. 

మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ షెడ్యూల్‌ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 8 ఫైనల్‌తో నూతన షెడ్యూల్‌ బీసీసీఐ రూపొందించిందన్న విషయం విదితమే. 

ఐపీఎల్‌ 13 సీజన్‌ మార్చి 29-మే 24న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు, తర్వాత నిరవధిక వాయిదా పడింది. అప్పట్నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీలు వాయిదా పడేందుకు బీసీసీఐ ఎదురుచూసింది. దీంతో ఐపీఎల్‌ నిర్వహణకు 8 వారాల సమయం లభించింది. 

యుఏఈలో మూడు స్టేడియాల్లో ఐపీఎల్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. షేక్‌ జయేద్‌ క్రికెట్‌ స్టేడియం, అబుదాబి, దుబాయి, షార్జాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మూడు స్టేడియాలను అద్దెకు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఐసీసీ అకాడమీకి సైతం బోర్డు అద్దెకు తీసుకునే యోచనలో ఉంది. యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే, అభిమానులను సైతం పరిమిత సంఖ్యలో అనుమతించే అవకాశం లేకపోలేదు.

click me!