గాయంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొత్తానికి దూరమైన హార్ధిక్ పాండ్యా... కెఎల్ రాహుల్‌ని టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి ఏడు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... పూర్తిగా కోలుకోకపోవడంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు..
హార్ధిక్ పాండ్యా స్థానంలో యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు 2023 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా గాయంతో ప్రపంచ కప్‌కి దూరం కావడంతో కెఎల్ రాహుల్‌కి ప్రమోషన్ లభించింది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కెఎల్ రాహుల్, టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరమైన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు..
పాకిస్తాన్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో 111 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ కీపింగ్‌లోనూ అదరగొడుతున్న కెఎల్ రాహుల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ టోర్నీలో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది..
కెఎల్ రాహుల్‌కి తిరిగి వైస్ కెప్టెన్సీ దక్కడంతో ఈసారి కూడా అలాంటి రిజల్ట్ రిపీట్ అవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలోనూ మొదటి 7 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు, సెమీ ఫైనల్‌లో నిష్కమించింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా సెమీస్‌లో ఓడింది.
ఈసారి ఇండియాలో జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో భారత జట్టు కచ్ఛితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమాగా ఉన్నారు అభిమానులు.