హనుమ 'వీర' విహారీ: ఓపెనింగ్ పరీక్షలో ముగ్గురూ విఫలం

By telugu teamFirst Published Feb 14, 2020, 11:38 AM IST
Highlights

న్యూజిలాండ్ పై జరుగుతున్న సన్నాహక మ్యాచులో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్ మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యారు. తెలుగు క్రికెటర్ హనుమ విహారీ సెంచరీ చేసి తన సత్తా చాటాడు.

హామిల్టన్: న్యూజిలాండ్ పై జరిగే తొలి టెస్టు మ్యాచులో ఓపెనర్లుగా ఎవరిని దించాలనే ప్రశ్నకు న్యూజిలాండ్ ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ టీమిండియాకు ఏ విధమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం హామిల్టన్ వేదికగా జరుగుతున్న సన్నాహక మ్యాచులో ఓపెనర్లుగా దిగడానికి పోటీ పడుతున్న ముగ్గురు భారత బ్యాట్స్ మెన్ కూడా నిరాశపరించారు. 

మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్ మన్ గిల్ ముగ్గురు కూడా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మన్ గిల్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయిదో స్థానంలో వచ్చిన అజింక్యా రాహన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత్ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

Also Read: పృథ్వీ షాతో నాకేం పోటీ లేదు, అది మేనేజ్ మెంట్ తలనొప్పి: శుభ్ మన్ గిల్

ఛతేశ్వర పుజారా, తెలుగు క్రికెటర్ హనుమ విహారీ ఇన్నింగ్సును చక్కదిద్దారు. 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో పుజారాకు హనుమ విహారీ తోడయ్యాడు. వీరిద్దరు ఐదో వికెట్ కు 193 పరుగులు జత చేశారు. పుజారా 93 పరుగులు చేసి పెవిలియన్ చేరుకోగా, హనుమ విహారీ 101 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. హనుమ విహారీ సెంచరీలో 10 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అతను 182 బంతులు ఆడాడు. 

ఆ తర్వాత రిషబ్ పంత్ ఏడు పరుగులు మాత్రమే చేస్తే సహా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కు్గీలజీన్ , ఇష్ సోథీలు మూడేసి వికెట్లు తీయగా, గిబ్బన్ రెండు వికెట్లు తీశాడు. నీషమ్ కు ఒక్క వికెట్ దక్కింది. ఇండియా న్యూజిలాండ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Also Read: అగ్రెసివ్ గా బంతులేయాలి, ప్రత్యర్థుల్లో వణుకు పుడుతుంది: బుమ్రాపై జహీర్ ఖాన్

click me!