Azmatullah Omarzai: వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ లో అద్భుతమైన బౌలింగ్ తో మరోసారి అదరగొట్టాడు.
IPL 2024 - Azmatullah Omarzai : ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్థాన్ అద్బుతమైన ఆటతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 57 పరుగుల తేడాతో ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20లో అజ్మతుల్లా ఉమర్జాయ్ కిల్లర్ బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను వరుసగా పెవిలియన్ కు పంపాడు. అతనితో పాటు నవీన్ ఉల్ హక్, ఇబ్రహీం జద్రాన్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చారు.
జద్రాన్ ఫోర్లు, సిక్సర్ల వర్షం..
undefined
ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మహ్మద్ ఇషాక్ 27 పరుగులు, సెడిఖుల్లా అటల్ 19 పరుగులు, ఇజాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్ 10 పరుగులు చేశారు. ఐర్లాండ్ తరఫున మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, బెంజమిన్ వైట్ తలో వికెట్ తీశారు.
ఆ తప్పులు చేసింది ఎంఎస్ ధోని.. రోహిత్ కాదు.. !
ఒమర్జాయ్ కిల్లర్ బౌలింగ్
156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ జట్టు 17.2 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. కర్టిస్ కాంఫర్ 28 పరుగులు, గారెత్ డెలానీ 21 పరుగులు చేశారు. హ్యారీ ట్యాక్టర్ 16 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ తరఫున ఒమర్‌జాయ్ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు తీసుకుని ఐర్లాండ్ పతనాన్ని శాసించాడు. అతడికి తోడు నవీన్ ఉల్ హక్ 2.2 ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.
గుజరాత్ టీమ్ లో ఒమర్జాయ్..
వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. 50 లక్షలకు ఉమర్‌జాయ్‌ను గుజరాత్ దక్కించుకుంది. జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటును పూడ్చగలడని ఉమర్జాయ్ గురించి చెప్పుకుంటున్నారు. అతని ఆటతీరు చూసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ ఆశిష్ నెహ్రా సంతోషిస్తారు. ఇప్పుడు మరోసారి తన బౌలింగ్ తో అదరగొట్టిన ఉమర్జాయ్ ఇతర ఐపీఎల్ జట్లను ఎవరూ తనను తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాడు.
ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్-5 క్రికెటర్లు వీరే..