GT vs RR Highlights : చివ‌రి బంతికి గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ర‌షీద్ ఖాన్ ర‌ఫ్ఫాడించాడు.. !

By Mahesh Rajamoni  |  First Published Apr 11, 2024, 12:33 AM IST

GT vs RR Highlights : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు తెవాటియా, రషీద్ ఖాన్ లు షాకిచ్చారు. చివ‌రిబంతి వ‌ర‌కు పోరాటం సాగించి  గుజరాత్ కు థ్రిల్లింగ్ విక్ట‌రీని అందించారు. దీంతో సంజూ శాంస‌న్, రియాన్ ప‌రాగ్ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లు వృథా అయ్యాయి. 
 


GT vs RR Highlights : ఐపీఎల్ 2024 మ‌రో ఉత్కంఠ రేపే మ్యాచ్ చివ‌రి బంతికి గుజ‌రాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీని అందుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలుస్తుంద‌నుకునే టైమ్ లో తెవాటియా, ర‌షీద్ ఖాన్ లు సంజూ శాంసన్ టీమ్ కు షాకిచ్చాడు. గుజ‌రాత్ టైటాన్స్ మూడో విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్ లో తొలి ఓట‌మిపాలైంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. దీంతో ఈ మ్యాచ్ లో సంజూ శాంస‌న్, రియాన్ ప‌రాగ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ వృథా అయ్యాయి.

ఐపీఎల్ 2024  24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్లు తలపడ్డాయి.  జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. 197 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఉత్కంఠ పోరులో చివ‌రిబంతికి విజ‌యం సాధించింది.

Latest Videos

ముగ్గురు మోన‌గాళ్లు.. టీ20 వరల్డ్ కప్ 2024 భారత జట్టులో వీరు ఉండాల్సిందే.. !

సంజూ శాంస‌న్ వ‌రుస హాఫ్ సెంచ‌రీలు.. మ‌రోసారి అద‌ర‌గొట్టిన రియాన్ ప‌రాగ్ 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్స్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. జోష్ బ‌ట్ల‌ర్ నిరాశప‌రిచాడు. య‌శ‌స్వి జైస్వాల్ 24 ప‌రుగులు కొట్టాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్ మ‌రో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో రాణించాడు. కెప్టెన్ గా త‌న 50వ మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. 38 బంతుల్లో  68 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. మ‌రో ఎండ్ లో రియాన్ ప‌రాగ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. 3 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 76 ప‌రుగులతో రాణించాడు. చివ‌ర‌లో హిట్మేయ‌ర్ ఒక ఫోర్, సిక్స‌ర్ తో రాజస్థాన్ రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ ముందు 197 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది.

 

Masssss! 🔥 pic.twitter.com/aY9TtEMPq2

— Rajasthan Royals (@rajasthanroyals)

గుజ‌రాత్ కు సూప‌ర్ శుభారంభం.. చివ‌ర‌లో ర‌షీద్, తెవాటియా మెరుపులు

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గు మంచి శుభారంభం ల‌భించింది. సాయి సుద‌ర్శ‌న్, శుభ్ మ‌న్ గిల్ అద్భుత‌మైన షాట్లు ఆడారు. సాయి సుదర్శన్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 72 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్ లో ౌట్ అయ్యాడు. మాథ్యూ వేడ్, మనోహర్, విజయ్ శంకర్ లు నిరాశపరిచాడు. చివరలో రషీత్ ఖాన్, రాహుల్ తెవాటియా ధనాధన్ ఇన్నింగ్స్ లో గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. మ్యాచ్ చివరి బంతికి ఫోర్ కొట్టి గుజరాత్ కు విజయాన్ని అందించాడు రషీద్ ఖాన్. ఆఖరి బంతికి జట్టుకు 2 పరుగులు కావాలి. ఆఫ్ సైడ్ లో రషీద్ ఫోర్ కొట్టడంతో గుజరాత్ విజయాన్ని అందుకుంది.

 

pic.twitter.com/FYjxoRkGtV

— Gujarat Titans (@gujarat_titans)

ముచ్చ‌ట‌గా మూడో హాఫ్ సెంచ‌రీ.. కెప్టెన్ గా సంజూ శాంస‌న్ మ‌రో రికార్డు

 

WHAT. A. WIN 🔥🔥

The pair of R & R has done it against 👏👏

Rahul Tewatia & Rashid Khan pull off a famous win in Jaipur 👏👏

Scorecard ▶️ https://t.co/1HcL9A97Ch | pic.twitter.com/eImggsoNKB

— IndianPremierLeague (@IPL)

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.

గుజరాత్ టైటాన్స్ ప్లెయింగ్ 11 : శుభ్ మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

 

click me!