ముచ్చ‌ట‌గా మూడో హాఫ్ సెంచ‌రీ.. కెప్టెన్ గా సంజూ శాంస‌న్ మ‌రో రికార్డు

By Mahesh RajamoniFirst Published Apr 10, 2024, 9:48 PM IST
Highlights

IPL 2024  : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. రాజస్థాన్ కెప్టెన్ గా మరో రికార్డు సాధించాడు.  
 

IPL 2024 - Sanju Samson : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024లో సంజూ శాంస‌న్ దంచికొడుతున్నాడు. వ‌రుస హాఫ్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొడుతున్నాడు. రాజ‌స్థాన్ కెప్టెన్ గా దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్ 2024లో 24వ మ్యాచ్ లో గుజ‌రాత్ పై కూడా హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 3 వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ ముందు 197 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది రాజస్థాన్ రాయ‌ల్స్. 

ఐపీఎల్ 2024 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్లు తలపడ్డాయి.  ఈ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ కెప్టెన్ గా త‌న 50వ మ్యాచ్ ఆడుతున్నాడు. కెప్టెన్ గా త‌న 50వ మ్యాచ్ లో ఫోర్లు, సిక్స‌ర్లు కొడుతూ మ‌రో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అలాగే, యుజ్వేంద్ర చాహల్ తన 150వ మ్యాచ్ ను ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

స్టార్లు ఉన్నా స‌త్తాచాట‌లేక‌పోతున్నారు.. బెంగళూరుకు ఏమైంది?

కెప్టెన్‌గా సంజు మ‌రో హాఫ్ సెంచ‌రీ.. 

రాజస్థాన్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ తన 50వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతను 4 మ్యాచ్‌లు ఆడాడు. సంజు సాసన్ రెండు అర్ధ సెంచరీలతో 178 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 82 పరుగులు నాటౌట్. ఇక ఐదో మ్యాచ్ లో మ‌రో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. సంజూ శాంస‌న్ 38 బంతులో 68 ప‌రుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు,  2 సిక్స‌ర్లు బాదాడు. మరో ఎండ్ లో రియాన్ పరాగ్ 76 పరుగులతో అదరగొట్టాడు. 

టీ20లలో రాజ‌స్థాన్ త‌ర‌ఫున అత్య‌ధిక 50+ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్లు..

25 - సంజు శాంసన్ (131 ఇన్నింగ్స్ లు)*
24 - జోస్ బట్లర్ (76 ఇన్నింగ్స్ లు)
23 - అజింక్య రహానే (99 ఇన్నింగ్స్ లు)
16 - షేన్ వాట్సన్ (81 ఇన్నింగ్స్ లు)
9 - యశస్వి జైస్వాల్ (42 ఇన్నింగ్స్ లు)

కెప్టెన్‌గా 50వ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు చేసిన ప్లేయ‌ర్లు 

68* (38) - సంజు శాంసన్ (రాజ‌స్తాన్ vs గుజ‌రాత్, 2024)
59 (46) - గౌతమ్ గంభీర్ (కోల్ క‌తా vs బెంగ‌ళూరు, 2013)
65 (48) - రోహిత్ శర్మ (ముంబ‌యి vs ఢిల్లీ, 2016)
45 (33) - డేవిడ్ వార్నర్ (హైద‌రాబాద్ vs ఢిల్లీ,  2021)

రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ ఆడతాడా? భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?

click me!