కేఎల్ రాహుల్ కి గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్..?

By telugu news teamFirst Published Apr 19, 2021, 7:28 AM IST
Highlights

కాగా.. ఆమె విషెస్ తోపాటు.. అతియా తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించడం విశేషం. రాహుల్‌కు విషెస్ చెబుతూ.. అత‌నితో దిగిన ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది

పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తాజాగా 29వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.  కాగా.. రాహుల్ కి బర్త్ డే విషెస్ తెలిపిన వారిలో బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టి కూడా ఉన్నారు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె విషెస్ చాలా స్పెషల్ గా నిలిచాయి.

 

కాగా.. ఆమె విషెస్ తోపాటు.. అతియా తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూడా స్పందించడం విశేషం. రాహుల్‌కు విషెస్ చెబుతూ.. అత‌నితో దిగిన ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. '' గ్రేట్‌ఫుల్ ఫ‌ర్ యు, హ్యాపీ బ‌ర్త్ డే'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫోటోలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కడా బయటపెట్టకపోవడం విశేషం. దీనిపై అతియా తండ్రి, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా స్పందించాడు.  హ్యాపీ బర్త్‌డే రాహుల్‌.. అంటూ ఓ బ్లాక్ క‌ల‌ర్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. కాగా.. సునీల్ శెట్టి అలా పాజిటివ్ గా స్పందించడం నెట్టింట చర్చనీయాంశమైంది. రాహుల్, అతియాలు త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని.. అందుకు సునీల్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. అందుకే ఇలా బర్త్ డే విషెస్ తెలియజేశాడని పలువురు భావిస్తుండటం విశేషం.

ఇదిలా ఉండగా...‘మై క్యూటీస్’అంటూ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా కూడా అతియా పోస్ట్‌పై కామెంట్ చేశాడు.కాగా కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బిజీగా ఉ‍న్న సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్‌ అర్థ శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. మయాంక్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన రాహుల్‌ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా 69 పరుగులతో రాణించడంతో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

click me!