ముత్తయ్య మురళీధరన్‌కి గుండెపోటు... చెన్నైలో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ స్పిన్నర్..

Published : Apr 18, 2021, 11:00 PM IST
ముత్తయ్య మురళీధరన్‌కి గుండెపోటు... చెన్నైలో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ స్పిన్నర్..

సారాంశం

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ముత్తయ్య మురళీధరన్... ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న ముత్తయ్య మురళీధరన్...

శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ గుండెపోటుతో చెన్నైలో ఆసుపత్రిలో చేరారు. ముత్తయ్య మురళీధరన్‌కి అంగీయోప్లాస్టీ కూడా చేసినట్టు సమాచారం.. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఇండియాకి వచ్చిన ముత్తయ్య మురళీధరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు.

ప్రస్తుతం చెన్నైలో మ్యాచులు ఆడుతున్న సన్‌రైజర్స్‌కి బౌలింగ్ సలహాదారుగా ఉన్న ముత్తయ్య మురళీధరన్, కొన్నిరోజుల క్రితం ఆరెంజ్ ఆర్మీతోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అన్ని ఫార్మాటలలో కలిపి 1300లకు పైగా వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్, టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఉన్నాడు. 

49 ఏళ్ల ముత్తయ్య మురళీధరన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, త్వరలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలుస్తారని ఆశిస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ...

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !